భారత్ లో అట్లుంటది క్రేజ్.. వరల్డ్ కప్ తో భారీ ఆదాయం

మన దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. క్రికెట్ రెలిజియన్ కంట్రీగా భారత్ కే పేరుంది. అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్యకు ఇండియా నుంచే అత్యధిక ఆదాయం వస్తోంది.

  • Written By:
  • Publish Date - September 11, 2024 / 06:10 PM IST

మన దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. క్రికెట్ రెలిజియన్ కంట్రీగా భారత్ కే పేరుంది. అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్యకు ఇండియా నుంచే అత్యధిక ఆదాయం వస్తోంది. తాజాగా గత ఏడాది వన్డే ప్రపంచకప్ తో అటు ఐసీసీ, ఇటు భారత్ ఆర్థిక వ్యవస్థ బాగానే లాభపడ్డాయి. ఈ మెగా టోర్నీతో భారత్ కు 11 వేల 637 కోట్ల ఆదాయం వచ్చింది. మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన నగరాల్లో టూరిజం, వసతి, ప్రయాణం, రవాణా, ఆహారం, పానీయాల అమ్మకాల ద్వారా 861.4 మిలియన్‌ డాలర్ల ఆదాయం వచ్చినట్లు ఐసీసీ తెలిపింది. టూరిజం ద్వాపా ప్రత్యక్షంగా సుమారు 48,000 కంటే ఎక్కువమంది పార్ట్ టైమ్, ఫుల్ టైమ్‌ ఉద్యోగావకాశాలు పొందారని ఐసీసీ వెల్లడించింది.