ఐపీఎల్ మెగావేలంలో పేస్ బౌలర్లపై కాసుల వర్షం కురుస్తోంది. తమిళనాడు పేసర్ టీ నటరాజన్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఏకంగా 10.75 కోట్ల రూపాయలతో అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తీసుకుంది. 2017లో ఐపీఎల్‌లో అడుగు పెట్టిన అతను మొదట కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కు ఆడగా.. ఆ తర్వాత సన్ రైజర్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. 2018లో నటరాజన్ కోసం పంజాబ్ 40 లక్షల వెచ్చించగా.. 2022లో సన్ రైజర్స్ హైదరాబాద్ 4 కోట్ల రూపాయలతో దక్కించుకుంది. ఇప్పుడు వేలంలో నటరాజన్ కు గట్టి డిమాండే నెలకొనడంతో రేటు పెరుగుతూ పోయింది. ఈ క్రమంలో అతని కోసం బిడ్ 10 కోట్ల రూపాయల మార్క్ దాటింది. 2024 సీజన్‌లో 19 వికెట్లతో అత్యధిక వికెట్ల జాబితాలో ఒకడిగా నిలిచిన నటరాజన్ ఓవరాల్ గా ఐపీఎల్‌లో 61 మ్యాచ్‌లలో 67 వికెట్లు తీసుకున్నాడు.