Weather Update : దేశ వ్యాప్తంగా భారీ ఎండలు.. భానుడి భగభగ.. జనం విలవిల

దేశ వ్యాప్తంగా వడదెబ్బ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారీ ఉష్ణోగ్రతలకు తాళలేక ఉత్తరాది ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. బిహార్లోని ఔరంగాబాద్లో బుధవారం 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, వేడి సంబంధ సమస్యలతో జిల్లా ఆస్పత్రిలో 2 గంటల వ్యవధిలో 16 మంది మరణించారు. గత 24 గంటల వ్యవధిలో వడగాలులకు మరో 19 మంది చనిపోయారు

 

 

 

దేశ వ్యాప్తంగా వడదెబ్బ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారీ ఉష్ణోగ్రతలకు తాళలేక ఉత్తరాది ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. బిహార్లోని ఔరంగాబాద్లో బుధవారం 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, వేడి సంబంధ సమస్యలతో జిల్లా ఆస్పత్రిలో 2 గంటల వ్యవధిలో 16 మంది మరణించారు. గత 24 గంటల వ్యవధిలో వడగాలులకు మరో 19 మంది చనిపోయారు. వేడి-సంబంధిత కారణాల వల్ల మరో 35 మంది అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు. ఎండలకు ఢిల్లీలో ఓ వ్యక్తికి అసాధారణ స్థాయిలో 108 డిగ్రీల సెల్సియన్ జ్వరం వచ్చింది. కిడ్నీలు, కాలేయం విఫలమై అతను చనిపోయారు. ఇక ఒడిశాలో వడదెబ్బ కారణంగా 10 మంది మృతి చెందారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 6గంటల వ్యవధిలో ఈ మరణాలు సంభవించాయని రూర్కెలా ప్రభుత్వ ఆసుపత్రి ఇంఛార్జ్ డైరెక్టర్ సుధారాణి ప్రధాన్ తెలిపారు. “మృతుల శరీర ఉష్ణోగ్రతలు దాదాపు 103-104 డిగ్రీల ఫారెన్హీట్గా ఉన్నాయి. ఇది వాతావరణ పరిస్థితులను బట్టి చాలా ఎక్కువగా ఉంటుంది” అని సుధారాణి పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. దాదాపు 44 డిగ్రీలు ఎండలు కొడుతుండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుంది. సాయంత్ర ఐదు అయిన ఎండలు తగ్గడం లేదు. వేడి విపరీతంగా పెరిగిపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నేడు రాష్ట్రంలోని 145 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివిధ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదు అవుతాయని అంచనా వేసింది. గురువారం ప్రకాశం జిల్లా పామూరులో 44.8°C, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.7°C ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. మరో మూడు రోజులు ఎండలు కొడుతాయని వాతవరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వాతవరణ శాఖ సూచిస్తుంది.