ఒక్క మ్యాచ్‌తో వందల కోట్లు, టైసన్‌ను ఓడించిన పాల్‌కు ప్రైజ్‌ మనీ ఎంతో తెలుసా

బాక్సింగ్‌ అంటే ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ ఫస్ట్‌ గుర్తొచ్చే పేరు మైక్‌ టైసన్‌. కొత్తగా బాక్సింగ్‌ నేర్చుకునే చాలా మందికి ఆయన ఒక ఇన్స్‌పిరేషన్‌. బ్యాడ్‌ బాయ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌గా ఆయనను పిలుస్తారంటే ఆయన గేమ్‌ ఆడే విధానం ఎంత అగ్రెస్సివ్‌గా ఉంటుందో ఆలోచించుకోవచ్చు.

  • Written By:
  • Publish Date - November 18, 2024 / 12:09 PM IST

బాక్సింగ్‌ అంటే ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ ఫస్ట్‌ గుర్తొచ్చే పేరు మైక్‌ టైసన్‌. కొత్తగా బాక్సింగ్‌ నేర్చుకునే చాలా మందికి ఆయన ఒక ఇన్స్‌పిరేషన్‌. బ్యాడ్‌ బాయ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌గా ఆయనను పిలుస్తారంటే ఆయన గేమ్‌ ఆడే విధానం ఎంత అగ్రెస్సివ్‌గా ఉంటుందో ఆలోచించుకోవచ్చు. ఆయన పంచ్‌పవర్‌ ముందు బాక్సింగ్‌లో పెద్ద పెద్ద ఛాంపియన్స్‌ కూడా నిలబడలేకపోయారు. అలాంటి మైక్‌ టైసన్‌ ఓ కుర్ర బాక్సర్‌ చేతిలో ఓడిపోవడాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ప్రొఫెషనల్ రింగ్ లోకి దిగిన మైక్‌టైసన్.. మునుపటి ఉత్సాహం చివరివరకూ చూపించలేకపోయాడు.

యూ ట్యూబర్ జేక్ పాల్తో జరిగిన ఫైట్‌లో 74-78 తేడాతో ఓడిపోయాడు. దీంతో టైసన్‌ ఫ్యాన్స్‌ అంతా ఇంటర్నెట్‌లో తెగ బాధపడిపోతున్నారు. గ్యాప్‌ వచ్చింది కాబట్టే టైసన్‌ ఓడిపోయాడంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కొందరైతే టైసన్‌ ఓటమిని తట్టుకోలేక టీవీలు పగలగొడుతున్నారు. అయితే మ్యాచ్‌లో ఓడిపోయినా ఈ మ్యాచ్‌తో ఇద్దరూ ఛాంపియన్స్‌ భారీగానే సంపాదించినట్టు తెలుస్తోంది. ఈ ఫైట్‌లో గెలిచినందుకు గానూ జేక్‌పాల్‌ 40 మిలియన్‌ డాలర్లు సంపాదించాడు. అందే ఇండినయ్‌ కరెన్సీలో దాదాపు 337 కోట్లు. ఇక మైక్‌ టైసన్‌ కూడా 20 మిలియన్‌ డాలర్లు సంపాదించాడు. అంటే మన కరెన్సీలో దాదాపు 168 కోట్లు. దీంతో మ్యాచ్‌ పోయినా సంపద మాత్రం భారీగానే వచ్చిందని కొంత కాస్తైనా హ్యాపీగా ఫీలవుతున్నారు టైసన్‌ ఫ్యాన్స్‌.