Afghanistan: 380 మంది దుర్మరణం.. భూకంపంతో వణికిపోయిన అఫ్గాన్‌.. అంచనాకి అందనిఆస్తి నష్టం

అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం ఏర్పడింది. దీని భారిన పడి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడు ఎందుకు సంభవించిందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - October 8, 2023 / 09:22 AM IST

ఆఫ్ఘన్ లో పెను పెను భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో కనీసం 380 మంది మరణించారని, వేలాది మంది గాయపడ్డాని తెలుస్తోంది.. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. భూకంపం ధాటికి చాలా ఇళ్లు కూలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణనష్టం కూడా జరిగినట్లు సమాచారం. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని అతిపెద్ద నగరమైన హెరాత్‌కు వాయువ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. US జియోలాజికల్ సర్వే ప్రకారం, ప్రధాన భూకంపం తర్వాత రిక్టర్ స్కేల్‌పై 5.5, 4.7, 6.3, 5.9, 4.6 తీవ్రతతో ఐదు సార్లు భూకంపం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ‘మేము కార్యాలయంలో ఉన్నాము. ఒక్కసారిగా భవనం కంపించడం ప్రారంభించింది. గోడలలో పగుళ్లు కూడా కనిపించాయి. భయంతో మేము బయటకు వచ్చాం. నా కళ్ల ముందే పలు భవనాలు కూలిపోవడం కూడా చూసాం అని అక్కడ స్థానికులు చెప్పుకొచ్చారు…ఘటన జరిగిన వెంటనే ఆఫ్ఘనిస్తాన్ విపత్తు ప్రతిస్పందన దళాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. “ప్రథమ చికిత్స కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి…

గాయపడిన వేలాది మంది నగరంలోని ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆరోగ్య అధికారి తెలిపారు. చూస్తుంటే పరిస్థితి భయంకరంగా ఉందంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో భూకంపాలు తరచుగా సంభవిస్తాయి. ముఖ్యంగా హిందూ కుష్ పర్వత శ్రేణిలో ఇది యురేషియన్‌, భారతీయ టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ సమీపంలో ఉంది. గతేడాది జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భయంకరమైన భూకంపంలో దాదాపు 1,000 మంది మరణించారు. అలాగే సుమారు 10,000 మంది నిరాశ్రయులయ్యారు.