hyderabad drugs: అప్పుడు అక్క.. ఇప్పుడు చెల్లి.. ఈసారి బజ్జీలు కాదు.. డ్రగ్సే..

నిజానికి అప్పుడు కూడా లిషి పేరు వినిపించింది. ఐతే అప్పుడు తాము చీజ్ బజ్జీలు తినడానికి అక్కడికి వెళ్లామని కుషిత చెప్పింది. దీంతో ఆ తర్వాత కుషిత కాస్త.. చీజ్ బజ్జీల పాపగా సోషల్ మీడియాలో ఫేమస్ అయింది.

  • Written By:
  • Updated On - February 27, 2024 / 06:38 PM IST

hyderabad drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్స్ రైడింగ్‌లో.. 9మంది మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇందులో ఒక తెలుగు హీరోయిన్ చెల్లెలు ఉండడం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఇంకెవరో కాదు లిషి గణేష్. హీరోయిన్ కుషితకు.. ఈమె చెల్లి. కుషిత ఎవరు అనుకుంటున్నారా.. అప్పట్లో రాడిసన్ బ్లూ అనే పుడింగ్ పబ్ మీద రైడింగ్ జరిగింద గుర్తుంది కదా.. అప్పుడు కుషిత పేరు డ్రగ్స్‌ కేసులో తెరమీదకు వచ్చింది.

RAHUL GANDHI: రాతెలంగాణ నుంచి రాహుల్ పోటీ.. వయనాడ్ సీటుకు సీపీఐ ఎసరు

నిజానికి అప్పుడు కూడా లిషి పేరు వినిపించింది. ఐతే అప్పుడు తాము చీజ్ బజ్జీలు తినడానికి అక్కడికి వెళ్లామని కుషిత చెప్పింది. దీంతో ఆ తర్వాత కుషిత కాస్త.. చీజ్ బజ్జీల పాపగా సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. ఇప్పుడు ఆమెకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఆమె నటించిన బాబు నెంబర్ వన్ బుల్షిట్ గాయ్ అనే సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కూడా ఆమె నటించింది.. ఐతే ఎడిటింగ్ లో పాత్రను తొలగించారు. ఇప్పుడు ఆమె సోదరి లిషి గణేష్ మరోసారి రాడిసన్ గచ్చిబౌలి హోటల్ లో డ్రగ్స్ రైడ్ జరిగినప్పుడు పోలీసులకు కనిపించింది. ఈ కేసులో మొత్తం పది మంది మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో ఇద్దరు ఆడవాళ్లు కూడా ఉన్నారు. వారిలో లిషి గణేష్ కూడా ఉంది. దీంతో అక్కాచెల్లెళ్ల పేరు ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తోంది.

ఒకసారి జరిగితే పొరపాటు.. రెండోసారి కూడా వినిపించడం ఏంటి అనే చర్చ.. సోషల్‌ మీడియాలో వినిపిస్తోంది. ఐతే రాడిసన్ కేసులో.. చాలామంది ఉన్నారని.. వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. డ్రగ్స్‌ కేసులో లిషితో పాటు.. చాలామంది వీఐపీలు ఉన్నారు. అందులో అల్లు అర్జున్‌కు క్లోజ్ ఫ్రెండ్స్‌ కూడా ఉండడం హైలైట్. దీంతో రాడిసన్ బ్లూ వ్యవహారం.. ఇప్పుడు మరో మలుపు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.