Weather Update : చిమ్మచీకట్లలో హైదరాబాద్‌.. దంచికొడుతున్న భారీ వర్షం

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎదో మంత్ర వేసినట్లుగా హైదరాబాద్ నగరం అంత చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. ఆకాశం మొత్తం భారీగా నల్లటి మెబ్బులతో మేఘావృతం అయ్యింది.

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎదో మంత్ర వేసినట్లుగా హైదరాబాద్ నగరం అంత చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. ఆకాశం మొత్తం భారీగా నల్లటి మెబ్బులతో మేఘావృతం అయ్యింది.

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. ఈరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమే భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మీంనగర్‌, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి, అమీర్ పేట్, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, సికింద్రాబాద్, ట్యాంక్ బండ్, సచివాలయం, అల్వాల్, బాల్ నగర్,బోయిన్ పల్లి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్ లో వర్షం దంచి కొడుతుంది. ఇక మాదాపూర్, లక్డీకాపూల్, అమీర్ పేట్, తదితర ప్రాంతాల్లో వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. నగరంలోమధ్యాహ్నం 3 గంటల తర్వాత భారీ వర్షం కురుస్తుండటంతో ఐటీ షిఫ్టులు చేస్తున్న ఉద్యోగులు.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది.

వర్షం తో పాటుగా భారీ గంటకు 10 నుంచి 15 కి.మీ వేగంతో ఇదురు గాళ్లు వీయడంతో.. చాలా ప్రాంతాల్లో చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో మరో మూడురోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.