Hyderabad Traffic Police: ఇదిదా క్రేజ్‌.. కుమారి ఆంటీని ఫాలో అవుతున్న పోలీసులు..

ఫుడ్ స్టాల్ దగ్గర ట్రాఫిక్‌ జాంతో పోలీసులు కేసు నమోదు చేయగా.. ఇప్పుడు అదే పోలీసులు కుమారి ఆంటీని ఫాలో అవుతున్నారు. మళ్లీ కేసు పెట్టడానికి కాదు లేండి. కుమారి ఆంటీ డైలాగ్‌ను.. వాహనదారుల్లో అవగాహన తీసుకువచ్చేందుకు యూజ్‌ చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - February 20, 2024 / 03:49 PM IST

Hyderabad Traffic Police: సోషల్‌ మీడియా తెలిసిన వాళ్లకు కుమారి ఆంటీ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లో ఎక్కడో రోడ్‌సైడ్ ఫుడ్‌ అమ్ముకునే కుమారి ఆంటీ.. ఒక్క సంఘటనతో సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారింది. కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ తినేందుకు హైదరాబాద్ మాత్రమే కాకుండా పక్క పట్టణాల నుంచి కూడా యువకులు వచ్చేవారంటే అర్థం చేసుకోవచ్చు ఆ క్రేజ్ ఏంటో ! మీది మొత్తం థౌజండ్ అయింది.. రెండు లివర్లు ఎక్స్‌ట్రా.. ఈ ఒక్క డైలాగ్‌ కుమారి ఆంటీ లైఫ్‌ను మార్చేసింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

YS SHARMILA: ఏపీలోనూ షర్మిల పని అయిపోయిందా..? పొలిటికల్ కెరీర్‌కు ఇక ఎండ్‌ కార్డేనా..?

జనాలు భారీగా రావడం.. ట్రాఫిక్ పోలీసులు ఎంటర్ కావడం.. ఫుడ్‌స్టాల్ తొలగించాలని ఆదేశించి కేసు నమోదు చేయడం.. ఈ ఘటనపై సీఎం రేవంత్‌ రియాక్ట్ కావడంతో.. సోషల్‌ మీడియాలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. కుమారి ఆంటీ సెంట్రిక్‌గా రాజకీయ విమర్శలు కూడా వినిపించాయ్ ఆ మధ్య. ఫుడ్ స్టాల్ దగ్గర ట్రాఫిక్‌ జాంతో పోలీసులు కేసు నమోదు చేయగా.. ఇప్పుడు అదే పోలీసులు కుమారి ఆంటీని ఫాలో అవుతున్నారు. మళ్లీ కేసు పెట్టడానికి కాదు లేండి. కుమారి ఆంటీ డైలాగ్‌ను.. వాహనదారుల్లో అవగాహన తీసుకువచ్చేందుకు యూజ్‌ చేస్తున్నారు. మీది థౌజండ్ అయింది. రెండు లివర్లు ఎక్స్‌ట్రా అనే కుమారీ ఆంటీ డైలాగ్‌ను హైదరాబాద్‌ సిటీ పోలీసులు కాపీ కొట్టారు. కుమారీ ఆంటీ స్టైల్‌లో ట్రాఫిక్ ఉల్లంఘించిన వారిపై.. సోషల్‌ మీడియాలో సెటైర్లు వేశారు.

ఓ బైక్‌ మీద వాహనదారుడు.. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూనే, ఫోన్‌లో మాట్లాడుతున్న ఫొటోను ట్వీట్ చేసిన హైదరాబాద్ సిటీ పోలీసులు.. మీది మొత్తం థౌజండ్ అయింది.. యూజర్ చార్జీలు ఎక్స్ ట్రా అంటూ రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదెక్కడి మాస్ ర్యాగింగ్ పోలీస్ మావా అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే.. అడ్మిన్ బాబు ఐడియా అదిరింది అంటూ ఇంకొందరు రియాక్ట్ అవుతున్నారు. ఇక ట్రాఫిక్ రూల్స్‌పై జనాల్లో అవగాహన పెంచడానికి.. హైదరాబాద్ పోలీసులు వివిధ పద్ధతులను ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, ఫన్నీ పోస్టులతో పరోక్షంగా ట్రాఫిక్ రూల్స్ గుర్తుచేస్తున్నారు.