మల్లన్నకు హైడ్రా డెడ్ లైన్, వారం రోజులే టైం…!

బీఆరెఎస్ ఎమ్మేల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారుల నోటీసులు జారీ చేసారు . దుండిగల్ లోని ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు పంపారు.

  • Written By:
  • Publish Date - August 28, 2024 / 03:59 PM IST

బీఆరెఎస్ ఎమ్మేల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారుల నోటీసులు జారీ చేసారు . దుండిగల్ లోని ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు పంపారు. చిన్న దామెర చెరువు ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించారని నోటీసులు జారీ చేసారు. మొత్తం 8 ఎకరాల 24 గుంటల చెరువు అక్రమించారని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు.

7 రోజుల్లో నిర్మాణాలు తొలగించాలని… లేకపోతే మేమే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు స్పష్టం చేసారు. 489, 485, 458, 484, 492, 489 సర్వే నెంబర్ల లో బిల్డింగ్స్, షెడ్స్, వెహికిల్ పార్కింగ్ తో పాటు కాలేజీ రోడ్లు వేసారని గుర్తించారు రెవెన్యూ అధికారులు. హైకోర్టులో దాఖలైన పిటిషన్ లో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి లోని 13 చెరువుల్లో కబ్జాల వివరాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది కోర్టు. కోర్టు ఆదేశాలతో రెవెన్యూ అధికారులతో సర్వే చేయించారు కలెక్టర్.