యాక్షన్ స్టార్ట్ చేసిన హైడ్రా, బాహుబలి మిషన్ కు ఏమైంది…?

కూల్చివేతలకు కాస్త విరామం ఇచ్చిన హైడ్రా అధికారులు మళ్ళీ ఆదివారం నుంచి కూల్చివేతలు షురూ చేసారు. కూకట్పల్లిలో కమర్షియల్ షెడ్లు నేలమట్టం చేసారు. మొత్తం 16 నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. కూకట్పల్లి నల్ల చెరువు ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి.

  • Written By:
  • Publish Date - September 22, 2024 / 11:09 AM IST

కూల్చివేతలకు కాస్త విరామం ఇచ్చిన హైడ్రా అధికారులు మళ్ళీ ఆదివారం నుంచి కూల్చివేతలు షురూ చేసారు. కూకట్పల్లిలో కమర్షియల్ షెడ్లు నేలమట్టం చేసారు. మొత్తం 16 నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. కూకట్పల్లి నల్ల చెరువు ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. దీనితో పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. నల్లచెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు కాగా ఎఫ్డిఎల్, బఫర్ జోన్ కలిపి ఏడెకరాలు ఆక్రమించారు అని హైడ్రా గుర్తించింది.

బఫర్ జోన్ లో నాలుగు ఎకరాల్లో 50 కి పైగా అక్రమ నిర్మాణాలు జరిగాయి. ఎఫ్ టి ఎల్ పరిధిలో మూడు ఎకరాల్లో 25 పైగా భవనాలు 15 షెడ్లు అక్రమ నిర్మాణాలు జరిగినట్టు గుర్తించారు. ఇదిలా ఉండగా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్..(మo) కృష్ణారెడ్డిపేటలో కూల్చివేతలు ఆగాయి.

సాంకేతిక కారణంతో రిపేర్ కు వచ్చిన బాహుబలి మిషన్ ను రిపేర్ కు తీసుకుని వెళ్ళారు. మిషన్ రిపేర్ అయ్యే వరకు తాత్కాలికంగా కృష్ణారెడ్డిపేట కూల్చివేతలను నిలిపివేశారు. ఇక పటేల్ గుడా లో నాలుగు యంత్రాలతో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి.