హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. మహబూబాబాద్ కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడిన ఆయన… రాష్ట్రంలో ప్రతీ చెరువుని రక్షిస్తామని స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తామని స్పష్టం చేసారు. రామ్ నగర్ నాలాపై అక్రమ కట్టడాలు కూల్చడంతో ముప్పు తప్పింది అని అన్నారు
హైడ్రా మాదిరిగా అన్ని జిల్లాల్లో ప్రత్యేక వ్యవస్థలను తీసుకొస్తామని స్పష్టం చేసారు రేవంత్. ఖమ్మంలో మాజీ మంత్రి అక్రమ కట్టడాలు కట్టారని రేవంత్ ఆరోపించారు. చెరువుల్లో ఒక్క అక్రమ నిర్మాణం కూడా వదిలేది లేదని స్పష్టం చేసారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ఎక్కడ ఉన్నారని ఆయన నిలదీశారు. చెరువుల కబ్జాపై ప్రభుత్వం సీరియస్ గా ఉంటుందని, అక్రమ నిర్మాణాలకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు ఉంటాయని సిఎం స్పష్టం చేసారు. ప్రతిపక్ష నేత కొడుకు అమెరికాలో జల్సాలు చేస్తున్నారని అన్నారు.