మళ్ళీ మొదలుపెడుతున్న హైడ్రా, రంగంలోకి సిఎస్…?

కూల్చివేతలకు కాస్త విరామం ఇచ్చిన హైడ్రా అధికారులు ఇప్పుడు మళ్ళీ దూకుడు పెంచే అవకాశాలు కనపడుతున్నాయి. తాజాగా హైడ్రా అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి సమీక్షా సమావేశం నిర్వహించారు.

  • Written By:
  • Publish Date - August 29, 2024 / 12:46 PM IST

కూల్చివేతలకు కాస్త విరామం ఇచ్చిన హైడ్రా అధికారులు ఇప్పుడు మళ్ళీ దూకుడు పెంచే అవకాశాలు కనపడుతున్నాయి. తాజాగా హైడ్రా అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి సమీక్షా సమావేశం నిర్వహించారు. కూల్చివెతలపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సీఎస్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రాకు స్పష్టం చేసింది హైకోర్టు.

హైడ్రా, జీహెచ్ఏంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో సిఎస్ భేటీ అయ్యారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ జరిపారు. సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టర్లు హాజరు అయ్యారు. సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది. సంగారెడ్డి జిల్లాలో కూల్చివేతలపై హైడ్రా అధికారులు ఫోకస్ పెడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి.