Bihar Inter Exams : నేను పేదవాడిని నన్ను పాస్ చేయండి.. బీహర్ పరీక్షల్లో వింత సమాధానాలు

దేశవ్యాప్తంగా పలు రకాల పరీక్షలు జరుగుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే.. ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇలా ఉత్తర భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో ఇంటర్ మెట్రిక్యులేషన్ పరీక్షను ప్రభుత్వం నిర్వహించింది. ఇక ఆ పత్రాలను దిద్ది మార్కుల వివరాలను నమోదు చేసి విద్యార్థులకు విడుదల చేయాల్సి ఉంటుంది.

భారతదేశ విద్యార్థులందరూ.. బీహార్ విద్యార్థులే వేరయా..

ఏంటి అర్థం కాలేదా.. అయితే ఇది చదవాల్సిందే..

దేశవ్యాప్తంగా పలు రకాల పరీక్షలు జరుగుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే.. ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇలా ఉత్తర భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో ఇంటర్ మెట్రిక్యులేషన్ పరీక్షను ప్రభుత్వం నిర్వహించింది. ఇక ఆ పత్రాలను దిద్ది మార్కుల వివరాలను నమోదు చేసి విద్యార్థులకు విడుదల చేయాల్సి ఉంటుంది. ఇక్కడే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఎవరైనా పరీక్షలు ఉంటే.. నెల రోజుల నుంచి ప్రిపరేషన్ చేసుకొని.. పరీక్షలకు సిద్ధం అయ్యి పరీక్షల సమయంలో ప్రశ్నపత్రానికి జవాబులు రాస్తుంటారు. కొందరు చదవకుంటే.. ఆ ప్రశ్నలను వదిలేసి.. ఫెల్ అవుతుంటారు. ఇలా అయితే అది బీహార్ ఎలా అవుతుంది అంటారా.. అవును మరి అంత భిన్నంగా జరుగు తున్నాయి అక్కడి జవాబు పత్రాలు చూస్తే..

ఇక విషయంలోకి వెలితే.. బిహార్ లో ఇంటర్ మెట్రిక్యులేషన్ పరీక్షలు జరిగాయి. ప్రశ్నపత్రాలకు ఎమాత్రం సంబంధం లేకుండా.. జవాబులు రాశారు బీహార్ స్టుడేంట్స్. జరిగిన పరిక్ష జవాబు పత్రాలు దిద్దుతున్న ఉపాధ్యాయులకు వింతవింత సమాధాన పత్రాలు కనిపిస్తున్నాయి.
నేను పేదవాడిని నన్ను పాస్ చేయండి సార్.. అని ఒక విద్యార్థి వేడుకోగా
మరో విద్యార్థి సార్ దయచేసి నన్ను పాస్ చేయండి.. లేకపోతే మా అమ్మ-నాన్న నాకు పెళ్లి చేస్తారు. అని రాసింది కొందరు ఫన్నీ కవితలు, ప్రేమ పద్యాలు, ప్రేమ కథలు..మరో విద్యార్థి అయితే పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు బదులుగా వారికి ప్రేమ లేఖ రాశాడు. ఇంతటితో ఆగారా.. మరి కొందరు బెదిరిస్తూ రాసుకొచ్చారు. ఈ జవాబు పత్రాలను చూసి.. ఈ ప్రశ్నపత్రాలను దిద్దుతున్న అఖిలేష్ ప్రసాద్ అనే అధ్యాపకులు నవ్వలో.. ఏడవాలో తెలియక వాటిని మీడియాకు వెల్లడించారు.