SMITHA : నన్ను మీరేం పీకలేరు… నేను చెప్పిందే కరెక్ట్

సివిల్స్ లో దివ్యాంగుల కోటా అవసరమా అంటూ కామెంట్స్ చేసిన IAS అధికారి స్మితా సబర్వాల్ పై దుమారం రేగుతోంది. హక్కుల కార్యకర్తలు ఆమె వైఖరిపై ఫైర్ అవుతున్నారు.

 

 

సివిల్స్ లో దివ్యాంగుల కోటా అవసరమా అంటూ కామెంట్స్ చేసిన IAS అధికారి స్మితా సబర్వాల్ పై దుమారం రేగుతోంది. హక్కుల కార్యకర్తలు ఆమె వైఖరిపై ఫైర్ అవుతున్నారు. అయినా సరే తగ్గేదేలే అంటూ మరో ట్వీట్ చేసి… మరింత కాంట్రోవర్సీ చేశారు స్మిత. ఆమెపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనీ… లేకపోతే నిరాహార దీక్షకు దిగుతామని ప్రముఖ మోటివేటర్ బాల లత హెచ్చరించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

సివిల్స్ లో దివ్యాంగుల కోటాపై IAS అధికారి స్మితా సబర్వాల్ చేసిన కామెంట్స్ పై హక్కుల కార్యకర్తలు, లాయర్లు మండిపడుతున్నారు. IAS, IPS లాంటి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎక్కువ గ్రౌండ్ లెవల్లో పనిచేయాలి. జనం కష్టాలను నేరుగా వినాలి… అందుకోసం శారీరక దృఢత్వం అవసరం … వైకల్యం ఉన్నవాళ్ళు ఎలా చేస్తారని ప్రశ్నించారు స్మిత సబర్వాల్. అయితే అసలు ఆమె ఫీల్డ్ లో పరిగెత్తుతూ ఎంత కాలం పనిచేశారు. నీలాంటి వాళ్ళ కామెంట్స్ తో దివ్యాంగులు కుంగిపోతున్నారని ఫైర్ అయ్యారు మోటివేటర్ బాల లత. కోడ్ ఆఫ్ కండెక్ట్, సివిల్ సర్వెంట్ క్రమశిక్షణా రాహిత్యం కింద స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాదు… ఇప్పటికైనా సివిల్స్ పరీక్ష రాస్తా… నా కన్నా ఎక్కవ మార్కులు తెచ్చుకోగలవా… అని సవాల్ చేశారు బాలలత. 24 గంటల్లో తన మాటలు వెనక్కి తీసుకోకపోతే… ట్యాంక్ బండ్ మీద నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.

ఓ వైపు హక్కుల కార్యకర్తలు, లాయర్లు, మేథావులు… స్మిత కామెంట్స్ ని తప్పుబడుతుంటే… ఆమె అదే ధోరణితో మళ్ళో ట్వీట్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. తన కామెంట్స్ ను సమర్థించుకున్నారు. IPS, IFOS ల్లో దివ్యాంగుల కోటాను ఎందుకు అమలు చేయడం లేదో హక్కుల కార్యకర్తలు తెలుసుకోవాలన్నారు. IAS లకీ దీన్ని అమలు చేయాలని మరోసారి ట్వీట్ చేశారు స్మిత సబర్వాల్. దివ్యాంగులు సమాజంలో సమాన హక్కులతో కలసి జీవించాలనుకోవడంలో తప్పులేదు. కానీ అది సాధ్యపడదు అని మరోసారి తేల్చి చెప్పారు. స్మిత కామెంట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి ఏ యాక్షన్ తీసుకుంటారో చూడాలి.