సిరాజ్, హెడ్ డిష్యూం…డిష్యూం.. ఐసీసీ సీరియస్

అడిలైడ్ టెస్టులో ఆటతో పాటే ఆటగాళ్ళ మధ్య పలు స్లెడ్డింగ్ ఘటనలు కూడా మ్యాచ్ ను వేడెక్కించాయి. సహజంగానే ఆసీస్ ఆటగాళ్ళకు నోటి దురుసు.. మాటల యుద్ధంతో ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ భారత ఆటగాళ్ళు వారికి కూడా అదే స్థాయిలో సమాధానమిస్తుండడంతో మ్యాచ్ హాట్ హాట్ గా సాగింది.

  • Written By:
  • Publish Date - December 9, 2024 / 06:56 PM IST

అడిలైడ్ టెస్టులో ఆటతో పాటే ఆటగాళ్ళ మధ్య పలు స్లెడ్డింగ్ ఘటనలు కూడా మ్యాచ్ ను వేడెక్కించాయి. సహజంగానే ఆసీస్ ఆటగాళ్ళకు నోటి దురుసు.. మాటల యుద్ధంతో ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ భారత ఆటగాళ్ళు వారికి కూడా అదే స్థాయిలో సమాధానమిస్తుండడంతో మ్యాచ్ హాట్ హాట్ గా సాగింది. అయితే హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్, ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన స్లెడ్జింగ్ ఘటన హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై ఐసీసీ సీరియస్ అయినట్టు సమాచారం. దీనిపై మ్యాచ్ రిఫరీని ఐసీసీ నివేదిక కోరినట్టు తెలుస్తోంది. రెండో రోజు ఆట సందర్భంగా వీరిద్దరి మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది. సెంచరీతో చెలరేగిన హెడ్‌ను సిరాజ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. మంచి ఊపుమీద ఉన్న సిరాజ్ ట్రావిస్ హెడ్‌ను పెవీలియన్‌కు వెళ్లాల్సిందిగా సైగ చేశాడు.

హెడ్ కూడా బౌల్డ్ అయ్యాక సిరాజ్‌ను ఏదో అనడం కెమెరాలో రికార్డు అయింది. ఓవరాల్ గా దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మాటల యుధ్ధం కామనే అయినప్పటకీ… ఆటగాళ్ళు హద్దులు దాటడం సరికాదని చెప్పినట్టు తెలుస్తోంది. మ్యాచ్ రిఫరీ దీనిపై విచారించిన నివేదిక ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశముంది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని వీరిద్దరూ పూర్తి స్ధాయిలో ఉల్లఘించకపోవడంతో సస్పెన్షన్ వేటు పడకపోవచ్చు. ఐసీసీ వీరిద్దరిని జరిమానా లేదా మందలింపుతో విడిచిపెట్టే అవకాశముంది.

మరోవైపు అడిలైడ్ టెస్టులో మరో ఘటనలోనూ సిరాజ్ పై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పింక్ బాల్ టెస్ట్‌లో ల‌బుషేన్‌పై బాల్ విసిరిన టీమిండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌పై ప‌నిష్‌మెంట్ ప‌డ‌నున్న‌ట్లు తెలుస్తోంది. సిరాజ్ బౌలింగ్ చేస్తోండ‌గా…గ్యాల‌రీలో ఉన్న ఓ ప్రేక్ష‌కుడు డిస్ట్ర‌బ్ చేయ‌డంతో ల‌బుషేన్ బాల్ వేయ‌డం ఆప‌మ‌న్న‌ట్లుగా సిరాగ్‌కు చేయి చూపించాడు. అత‌డి రిక్వెస్ట్‌ను ప‌ట్టించుకోకుండా సిరాజ్ కోపంగా బాల్ అత‌డివైపు విసిరేశాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఉద్దేశ‌పూర్వ‌కంగా ల‌బుషేన్‌పై బాల్ విసిరినందుకు సిరాజ్‌కు ప‌నిష్‌మెంట్ విధించే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.