World cup 2023: వన్డేల్లో తోపు.. కోహ్లీ, రోహిత్‌కి ఏం మాత్రం తక్కువ కాదు..అయినా కూడా ట్రోల్‌ పీస్‌..!

ఓడే మ్యాచ్‌ను గెలిపించడం.. వన్డేల్లో అద్భుతమైన రికార్డులు కలిగి ఉండడం కేఎల్‌ రాహుల్‌ సొంతం. అయినా కూడా కొంతమంది టీమిండియా క్రికెట్‌ అభిమానులు అతడిని ట్రోల్‌ మెటిరియల్‌గానే చూస్తారు

  • Written By:
  • Publish Date - October 11, 2023 / 10:41 AM IST

ట్రోలింగ్‌ కూడా రీజనబుల్‌గా ఉండాలి. విమర్శలో నిజం ఉండాలి. అయితే సోషల్‌మీడియా ఎక్కువగా యూజ్‌ చేసే భారత్‌ క్రికెట్‌ అభిమానుల్లో కొంతమందికి ఈ బుద్ధి ఉండదు. ఎడాపెడా చేతికి వచ్చింది టైప్‌ చేసి పడేయడమే వచ్చు. కోహ్లీ, రోహిత్‌ని అభిమానులు దేవుడిలా చూసుకుంటారు. కానీ మిగిలిన ప్లేయర్లు ఎంత గొప్పగా ఆడినా పెద్ద గుర్తింపు ఉండదు. ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌ని చూస్తే ఆ విషయం క్లియర్‌ కట్‌గా అర్థమవుతుంది.

వరల్డ్‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో జట్టు గెలుపునకు కోహ్లీ, రాహుల్‌ ఇద్దరు కష్టపడ్డ మాట వాస్తవమే..కానీ రాహుల్‌ ఆట కోహ్లీ కంటే ఎంతో అద్భుతంగా ఉంది. స్ట్రైక్ రొటెట్‌ చేస్తూ కోహ్లీపై ఒత్తిడి పెరగకుండా చూసింది రాహులే. కావాల్సిన రన్‌ రేట్‌ పెరగనివ్వకుండా సింగిల్స్‌ తీస్తూ రాహుల్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి వరకు నాటౌట్‌గా కూడా నిలిచాడు. విన్నింగ్‌ షాట్ కూడా సిక్సర్‌.. ఇదే షాట్‌ ధోనీ కొట్టి ఉంటే ఆ లెవల్‌ వేరు ఉండేది. సోషల్‌మీడియా మారుమోగిపోయేది. రాహుల్‌ ఆడిన ఇన్నింగ్స్‌కి పెద్ద గుర్తింపు లేదు. కోహ్లీ చేసిన 85పరుగులను హైలెట్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. కోహ్లీకి ఫ్యాన్‌ బేస్‌ ఎక్కువే కావొచ్చు.. కానీ వరల్డ్‌కప్‌ లాంటి టోర్ని జరుగుతున్నప్పుడు ఫ్యానిజం లాంటివి పక్కనపెట్టి జట్టులో అందరికి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.

నిజానికి రాహుల్‌ టెస్టుల్లో, టీ20ల్లో మంచి బ్యాటర్‌ కాదు. టీ20ల్లో తొలినాళ్లలో మంచి స్ట్రైక్‌ రేట్‌తోనే బ్యాటింగ్‌ చేసినా తర్వాత అతని బ్యాటింగ్‌ శైలి మారింది. ముఖ్యంగా ఐపీఎల్‌లో జిడ్డు బ్యాటర్‌గా రాహుల్‌ ముద్రపడ్డాడు. ఇది వాస్తవమే. స్టాట్స్‌ చూపిస్తూ రాహుల్‌ని విమర్శించవచ్చు కూడా. అయితే వన్డేల్లో మాత్రం రాహుల్‌ ఆట వేరు. 2016లో జింబాబ్వేతో హరారేలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన రాహుల్‌ ఈ ఏడేళ్ల కాలంలో 62 వన్డేలు ఆడాడు. 49.75 సగటు, 87.50 స్ట్రైక్ రేట్‌తో 2,288 పరుగులు చేశాడు. 50కు దగ్గరగా సగటు ఉండడం చిన్న విషయం కాదు. ఆరు సెంచరీలు, 16 హాఫ్‌ సెంచరీలు చేశాడు. అంటే ప్రతి 2.6 మ్యాచ్‌లకు సగటున ఒక హాఫ్‌ సెంచరీ చేశాడు రాహుల్‌. ఇంతటి వన్డే రికార్డులు ఉన్న రాహుల్‌ని టీ20ల్లో ట్రోల్‌ చేసినట్టే ఎగతాళి చేస్తుండడం కరెక్ట్ కాదు.!