MISSION 15 MINISTERS : 15 సీట్లు గెలిపించకపోతే.. మంత్రి పదవులు ఊస్టింగ్

తెలంగాణ (Telangana)లో మిషన్ 15 అంటోంది కాంగ్రెస్ (Congress) హైకమాండ్. అంటే 15 ఎంపీ సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టింది.

 

తెలంగాణ (Telangana)లో మిషన్ 15 అంటోంది కాంగ్రెస్ (Congress) హైకమాండ్. అంటే 15 ఎంపీ సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టింది. ఈ 15 సీట్లు గెలిపించే బాధ్యత తెలంగాణలోని మంత్రులదే అంటోంది కాంగ్రెస్ హైకమాండ్… దాన్ని బట్టే మంత్రుల పనితీరును అంచనా వేస్తామంటున్నారు AICC జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (KC Venugopal).

తెలంగాణలో 15 ఎంపీ సీట్లు గెలిపిస్తేనే…వాళ్ళు రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేబినెట్ లో కొనసాగుతారని హింట్ ఇచ్చారు కేసీ వేణుగోపాల్. మంత్రుల పనితీరును ఢిల్లీ నాయకత్వం పరిశీలిస్తోందంటున్నారు. గాంధీభవన్ (Gandhi Bhavan) లో జరిగిన మీటింగ్ లో ఈ విషమం క్లియర్ గా చెప్పారు. మంత్రులే కాదు… కాంగ్రెస్ సీనియర్ నేతలకు కూడా AICC పెద్దలు టార్గెట్ పెట్టారు. లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఇంకా ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను భర్తీ చేస్తారు… అందులో బెర్త్ దక్కించుకోవాలంటే… ఇప్పుడు కాంగ్రెస్ కి ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యతను సీనియర్లు తీసుకోవాల్సిందే అంటోంది కాంగ్రెస్ హైకమాండ్.

తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలు ఉంటే… రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కకు తప్ప మిగతా మంత్రులందరికీ కూడా ఆయా నియోజకవర్గాల ఇంఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. అంటే 10 మంది మంత్రులు… 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలను తీసుకోవాలి… ఇంకా మిగిలిన 7ఎంపీ సీట్లల్లో కాంగ్రెస్ సీనియర్లకు ఇంఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. మొదట్లో సీఎం రేవంత్ కి చేవెళ్ళ, మహబూబ్ నగర్… అలాగే భట్టికి సికింద్రాబాద్ బాధ్యతలు అప్పగించింది AICC. ఆ తర్వాత మార్చి చివరి వారంలో వాళ్ళ పేర్లను ఇంఛార్జ్ లిస్టు నుంచి తీసేసింది AICC.

మే 13న తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. మే 11న పార్టీల ప్రచారం ముగుస్తుంది. ఇప్పటి నుంచి మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలంతా మే 11 దాకా నియోజకవర్గాల్లోనే ఉండాలని KC వేణుగోపాల్ ఆదేశించారు. ప్రచారం, బహిరంగ సభలు, రోడ్ షోలు…నాయకులందర్నీ కలుపుకుపోవడం… పోల్ మేనేజ్ మెంట్ బాధ్యతలను లోక్ సభ నియోజకవర్గాల ఇంఛార్జిగా ఉన్న మంత్రులు, సీనియర్ లీడర్లే చూసుకోవాలి. రాత్రిళ్ళు నియోజకవర్గాల్లోనే బస చేయాలి… ఊరికే హైదరాబాద్ కు రావొద్దని చెప్పారు కేసీఆర్ వేణుగోపాల్. హైదరాబాద్, సికింద్రాబాద్ ఇంఛార్జులు తప్ప… మిగతా మంత్రులు, సీనియర్ నేతలెవరూ హైదరాబాద్ సిటీకి రావొద్దని కోరారు.

ఇప్పుడు తెలంగాణ మంత్రుల మెడ మీద AICC కత్తి వేలాడుతోంది అనుకోవాలి… AICC ఇచ్చిన మిషన్ 15… అంటే 15 మంది ఎంపీ సీట్లను గెలిపించడానికి ఎవరు ఎంత ప్రయత్నం చేస్తారు… లోక్ సభ ఎన్నికల తర్వాత ఎవరి మంత్రి పదవి కోల్పోతారన్నది చూడాలి.