ప్రపంచంలో వందకు 99 సమస్యలు డబ్బుతోనే తీరిపోతాయ్ అంటారు.. కానీ గట్టిగా ట్రై చేయాలే కానీ.. వందకు వంద సమస్యలు డబ్బుతో తీరిపోతాయ్. అదీ మనీకి ఉన్న పవర్. ఇప్పుడీ డబ్బుల గోల ఎందుకు అనుకుంటున్నారా.. అంబానీ పెళ్లిలో జరుగుతున్న హడావుడితో.. డబ్బుకు ఉన్న పవర్ ఏంటో క్లియర్‌గా అర్థం అవుతోంది దేశానికి ! బాలీవుడ్ అంతా అంబానీ ఇంట్లోనే ఉంది. క్రికెటర్లు, స్పోర్ట్స్‌మెన్ అంతా.. ఆ ఇంటి పెళ్లిలోనే డ్యాన్స్‌లు వేస్తున్నారు. సొంతింటి పెళ్లి అంత సందడిగా కనిపిస్తున్నారు. ఇది కదా డబ్బుకున్న పవర్. అంబానీల ఇంట్లో పెళ్లికి.. భారతదేశం అంతా కదిలి వెళ్లింది. సెలబ్రిటీలు, క్రికెటర్లు, ముఖ్యమంత్రులు, బాలీవుడ్, టాలీవుడ్ నటులు.. పరుగులు పెట్టుకుంటూ వెళ్లారు.
దేశంలో టాప్ అనుకున్న వాళ్లంతా.. ఇప్పుడు అంబానీ ఇంట్లోనే కనిపిస్తున్నారు. టాలీవుడ్ నుంచి చెర్రీ, మహేష్‌బాబు.. కోలీవుడ్ నుంచి రజనీకాంత్.. శాండల్‌వుడ్ నుంచి యశ్‌తో పాటు దాదాపు అందరు హీరోలు.. అంబానీ ఇంటి పెళ్లికి వెళ్లిపోయారు. హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా.. పెళ్లిలో అదరగొడుతున్నారు. ఇక క్రికెటర్లు అయితే.. అదేదో తమ ఇంటి పెళ్లే అన్నంత హంగామా చేస్తున్నారు. ఎప్పుడూ సిగ్గుపడుతూ.. ఎవరితో కలవనట్లు.. తన పని మాత్రమే తెలిసినట్లు ఉండే ధోని కూడా.. అంబానీ పెళ్లిలో డ్యాన్స్‌లు అదరగొట్టారు. ఇక అమితాబ్, షారుఖ్, వరుణ్‌ధవన్, రణ్‌వీర్ సింగ్, ప్రియాంక చోప్రా, దీపికా, ఆలియా.. ఇలా పలకడానికి కూడా పెద్ద పేర్లు అనిపించే పర్సనాలిటీలు అన్నీ.. ఆ ఇంట్లో పెళ్లి డ్యాన్స్‌లు చేస్తున్నాయంటే.. అంబానీకి ఉన్న పవర్ అలాంటిది.. కాదు కాదు అంబానీ మనీకి ఉన్న పవర్ అలాంటిది మరి! నిజానికి అంబానీ ఎప్పుడు పిలుస్తారా అని వీళ్లంతా ఆరు నెలల నుంచి ఎదురుచూస్తున్నారు.
అంబానీ ఇంటి దగ్గర నుంచి శుభలేఖ రాగానే… ఆ వెడ్డింగ్ కార్డులను స్టేటస్‌గా పెట్టుకున్నారు. స్టేటస్ సింబల్‌గా ఫీలయిపోయి.. పదిమందికి చెప్పుకున్నారు. అంబానీ పెళ్లి కోసం.. వీళ్లే కొత్త బట్టలు కుట్టించుకున్నారు. ఐతే కొందరికి మాత్రం అంబానీ డ్రెస్సులు కుట్టించాడు. భారతదేశంలో డబ్బంతా ఒకే దగ్గర పోగు పడినట్లుగా… ప్రపంచదేశాల నుంచి సెలబ్రిటీలంతా తరలివచ్చారు. అసలు డబ్బుకి ప్రపంచంలో ఎంత విలువ ఉంటుందో.. డబ్బున్నవాడు విజిలేస్తే ఎలా కదిలివెళ్తారో.. అంబానీ పెళ్లి నిరూపించింది. అసలు అంబానీ పెళ్లి చూస్తే… వేరే దేశం వాడు ఎవడైనా సరే… భారతదేశంలో అసలు పేదరికమే లేదనుకుంటారు. అలా అంబానీ పిలవడమే ఆలస్యం.. దొర్లుకుంటూ పరిగెత్తారు. మరికొందరు అయితే.. అంబానీ ఏమనుకుంటాడోనని ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుని మరి వెళ్లారు. మనీ పవర్ ఎలా ఉంటుందో.. మరొకసారి ప్రపంచం మొత్తం చూసింది. అంబానీ పెళ్లికి వెళ్లిన వాళ్లకు కూడా సమాజంలో ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది.
అంబానీ పిలిచాడు అంటేనే వాడొక స్పెషల్ పర్సన్ అన్నట్టుగా లెక్క. అందుకే అంబానీ పెళ్లిని అందరు ఓన్ చేసుకున్నారు. పండగలా జరిపిస్తున్నారు. డబ్బుల వల్ల సమస్యలు తీరుతాయా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా.. డబ్బుకు ఉన్న పవర్.. భూమ్మీద దేనికి లేదు అన్నది క్లియర్. అంబానీ పెళ్లితో అర్థం అవుతోంది అదే కూడా ! అందుకే అంబానీ పిలిస్తే అన్నీ మూసుకొని వెళ్లారు.. పెళ్లి బరాత్‌లో ఇంటి ముందు డ్యాన్స్‌లు వేశారు. పెద్దపెద్ద సెలబ్రిటీలు అయినా.. సదా మీ ప్రేమకు బానిస అన్నట్లుగా అంబానీ పెళ్లిలో హడావుడి చేశారు. ఐనా సామాన్యులకు వాళ్లంతా సెలబ్రిటీలు కానీ.. అంబానీ కాదుగా.. ఇదే మాట్లాడుకుంటున్నారు జనాలంతా.. అంబానీ పెళ్లి హడావుడి చూసి !