Anti Biotics : యాంటీ బయోటిక్స్ రాస్తే.. ఎందుకో చెప్పాలి..?

ఈమధ్యకాలంలో యాంటీ బయోటిక్స్ (Antibiotics) వాడకం బాగా ఎక్కువైపోయింది. కరోనా (Corona) తర్వాత ప్రతి చిన్న రోగానికి డాక్టర్లు యాంటీ బయోటిక్స్ రాసేస్తున్నారు. పేషెంట్లు కూడా వాటికి బాగా అలవాటు పడుతున్నారు. దీనివల్ల వైరస్ (Virus), బ్యాక్టీరియలు (Bacteria) వీటికి అలవాటు.. చివరకు మందులు పనిచేకుండా పోతున్నాయి. అందుకే ఇలా యాంటీ బయోటిక్స్ వాడకంపై కేంద్రం నిబంధనలు (Center regulations) కఠినతరం చేసింది.

యాంటీబయోటిక్స్ విచ్చలివిడి వాడకాలపై కేంద్రం సీరియస్ నిబంధనలు తెచ్చింది. ఇక ముందు ఏ రోగికి అయినా యాంటి బయోటిక్స్ లేదా యాంటి మైక్రోబియల్ మెడిసన్స్ రాస్తే.. వాటికి ఎందుకు సిఫార్సు చేయాల్సి వచ్చిందో కారణాలను కూడా ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పై పేర్కొనాలి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అతుల్ గోయల్ అన్ని మెడికల్, ఫార్మసిస్ట్ సంఘాలకు, వైద్య కాలేజీలు ఎమర్జన్సీ రిక్వెస్ట్ పంపారు. యాంటీ బయోటిక్ విచ్చలివిడిగా వాడటం వల్ల యాంటీ మైక్రోబియల్ నిరోధకత అనే జబ్బు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సమస్యల్లో ఇది కూడా ఒకటిగా మారింది. 2019లో ఈ కారణంగా 12.7 లక్షల మంది చనిపోయినట్టు, 49 లక్షల మంది ఇన్ఫెక్షన్లతతో చనిపోయినట్టు గోయల్ తెలిపారు. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా కోటి మంది దాకా మరణించే ప్రమాదం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గతంలోనే హెచ్చరించింది.

యాంటీబయోటిక్స్ విపరీతంగా వాడటం వల్ల కొంతకాలానికి అవి రోగాలపై పనిచేయడం మానేస్తున్నాయి. పైగా వాటి వల్ల కొత్త ఇన్ఫెక్షన్స్ పుట్టుకొస్తున్నాయి. ధరలు అధికంగా ఉండటంతో రోగులు ఆర్థికంగానూ ఇబ్బదులు పడుతున్నారు. దీర్ఘకాలిక రోగాలకు కూడా ఇవి కారణమవుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఇకముందు యాంటీ బయోటిక్స్ రాసేముందు డాక్టర్ కూడా విచక్షణ ప్రదర్శించాలి. అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మెడికల్ షాప్ కూడా యాంటీ బయోటిక్స్ మందులు అమ్మకూడదని కేంద్రం ఆదేశించింది. కాబోయే డాక్టర్లు ఉన్న మెడికల్ కాలేజీలకు కూడా ఈ ఎమర్జన్సీ రిక్వెస్ట్ ను పంపింది.