Telugudesam Party: చంద్రబాబు అరెస్ట్ అయితే.. అల్లకల్లోలం ఎందుకు జరగలేదు.?

చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీలో స్పందన కరువు. దీనికి కారణం ఏంటి..

  • Written By:
  • Publish Date - September 9, 2023 / 08:10 PM IST

టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్టు వార్త తెలీయగానే.. తెలుగు రాష్ట్రా లు అట్టుడికి పోతాయని, అతలాకుతులం అయిపోతుందని.. చాలామంది భయపడ్డారు. కానీ అనూహ్యంగా జనంలో కానీ పార్టీ క్యాడర్ నుంచి గాని శృతి మించిన ఆందోళన ఏమి రాలేదు. విధ్వంసాలు జరగలేదు. పరిటాల రవి చనిపోయినప్పుడు.. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన విధ్వంసం మళ్లీ జరుగుతుందని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ ఎందుకో జనంలోనూ పెద్ద రియాక్షన్ లేదు. పార్టీ వర్గాల్లోనూ ఆసక్తి కనిపించలేదు. చంద్రబాబు నంద్యాల నుంచి విజయవాడ తరలిస్తున్నప్పుడు మార్గం మధ్యలో.. అద్దంకి, చిలకలూరిపేట లో మాత్రమే కొందరు కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్ కి, సిఐడి వాహనాలకు అడ్డుపడి ప్రతిఘటించారు. అంతకుమించి ఇంకెక్కడ పెద్ద సంఘటనలు చోటు చేసుకోలేదు.

చంద్రబాబు అరెస్టుకు ముందే అన్ని జిల్లాల్లోనూ టిడిపి నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. కానీ సాధారణ కార్యకర్తలు మాత్రం యధావిధిగా రోడ్లపైకి వచ్చారు. ఆందోళన చేయలేదు. జగన్, ఏపీ పోలీసులంటే భయంతో ఎటువంటి ఆందోళనకు దిగలేదా? లేక తాజా రాజకీయాలపై.. ప్రజల్లో నిరాశక్తత వచ్చేసిందా.. అనిపించింది. టీవీ చానల్స్ హడావుడి తప్ప జనంలో ఎక్కడ పెద్ద స్పందన కనిపించలేదు. ఏదైనా పెద్ద గొడవ జరిగితే నిలువరించడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నా అటువంటివి ఏమీ జరగలేదు. చంద్రబాబు తన అరెస్టు అవుతానని రెండు మూడు రోజులు ముందే చెప్పడం.. పార్టీ క్యాడర్ కూడా మానసికంగా సిద్ధమై ఉండటంతో.. ఊహించినంత వైల్డ్ రియాక్షన్ రాలేదని పెద్ద నాయకులు అనుకుంటున్నారు. చంద్రబాబును జనం పట్టించుకోవడం మానేశారని, క్యాడర్ కూడా మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి అన్న మీమాంస ఉండిపోయారని వైసిపి వాళ్ళు విశ్లేషిస్తున్నారు.

చంద్రబాబు అరెస్ట్ అవగానే సజ్జల రామకృష్ణారెడ్డి మొదలు వైసీపీ క్యాడర్ మొత్తం టక..టక ప్రెస్ మీట్ లు పెట్టి బాబుని కడిగిపారేశారు. కానీ టిడిపి పెద్ద నాయకులు ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు స్పందించలేదు. చంద్రబాబు నాయుడు అరెస్టు అయితే మనకి అడ్వాంటేజ్ అవుతుందని అనుకున్నారో ఏమో.. ఎవరు స్పందించలేదు. అయితే వ్యూహాత్మకంగానే మౌనం పాటించారా.. టిడిపి క్యాడర్ నిరాశలో ఉన్నారా అన్నది తేలాల్సి ఉంది.