YCP ASSEMBLY : అసెంబ్లీకి రాకపోతే అనర్హతే జగన్ వస్తారా… పారిపోతారా ?

ఏపీలో మొన్నటిదాకా అధికారం చెలాయించిన వైసీపీ మరీ 11 సీట్లకే పరిమితం అవడంతో.. ఇప్పుడు అసెంబ్లీకి రావాలంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మొహం చెల్లట్లేదు.

 

 

ఏపీలో మొన్నటిదాకా అధికారం చెలాయించిన వైసీపీ మరీ 11 సీట్లకే పరిమితం అవడంతో.. ఇప్పుడు అసెంబ్లీకి రావాలంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మొహం చెల్లట్లేదు. జగన్ కూడా ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలని కాబట్టి… చేసేసి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా బయటకు వచ్చారు. ప్రతిపక్షనేత హోదా ఎలాగూ దక్కలేదు. గత ఐదేళ్ళల్లో సభలో తాము చేసిన అరాచకం… ఇప్పుడు టీడీపీ సభ్యుల నుంచి ఎదురవుతుందని భయం. దీనికి తోడు తమ హయాంలో కేసులతో వేధించిన అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ స్పీకర్ స్థానంలో ఉన్నారు. ఆయన్ని అధ్యక్షా అని పిలవడం జగన్ కు అస్సలు ఇష్టం లేదు. అందుకే స్పీకర్ ఎన్నికకు తాను హాజరుకాలేదు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎగ్గొట్టారు. ఈమధ్య పార్టీ నేతల సమావేశాల్లో జగన్ మాట్లాడిన తీరు చూస్తుంటే… భవిష్యత్తులో అసెంబ్లీలో జగన్ తో పాటు మిగతా సభ్యులు కూడా డుమ్మా కొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

జగన్ గతంలో కూడా ఇలాగే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. 2017లో పాదయాత్ర ప్రారంభించే ముందు అసెంబ్లీకి వెళ్ళలేదు. తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా వెళ్ళొద్దని చెప్పేశారు. నాలుగు సెషన్లపాటు ఈ బహిష్కరణ కొనసాగింది. అప్పట్లో టీడీపీ సభ్యులే అధికార, ప్రతిపక్ష సభ్యులుగా కంటిన్యూ అయ్యారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు తనను, తన కుటుంబాన్ని అవమానించడంతో చంద్రబాబు నాయుడు కూడా శపథం చేసి అసెంబ్లీని బహిష్కరించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయ్యారు. గతంలో తమిళనాడులో జయలలిత, ఏపీలో ఎన్టీఆర్ కూడా అసెంబ్లీని బహిష్కరించారు. కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జగన్ మాత్రం అలా కాదు… తనతో పాటు వైసీపీ ఎమ్మె్ల్యేలను కూడా సభకు పంపొద్దని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

ఎన్నికైన ఎమ్మెల్యేలు… అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోతే ఏమవుతుంది. సభ్యత్వం పోతుందా ? ఎమ్మెల్యేగా అనర్హుడు అవుతాడా… అంటే వరుసగా మూడు అసెంబ్లీ సెషన్లకు డుమ్మా కొడితే ఆ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుంది. స్పీకర్ సిఫార్సుతో సభ్యత్వం రద్దవడంతో పాటు ఆయా స్థానాల్లో ఉపఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఒకవేళ కోర్టుకు వెళ్ళినా… స్పీకర్ నిర్ణయం ఫైనల్ కాబట్టి… కోర్టులు కూడా జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. లేదంటే వైసీపీ ఎమ్మెల్యేలు… అసెంబ్లీ సెషన్స్ జరిగిన ప్రతిసారీ స్పీకర్ దగ్గర సెలవుల కోసం అప్లయ్ చేయొచ్చు. ఆయన ఒప్పుకుంటే ఓకే. అలా కాకుండా 3 సెషన్స్ కి మించి వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకపోతే మాత్రం… ఆ 11 మంది సభ్యత్వం రద్దయ్యే ఛాన్సుంది. అదే జరిగితే జగన్ నియోజకవర్గం పులివెందులలో కూడా ఉపఎన్నికలు జరుగుతాయి.

ఒకవేళ ఏపీలో ఉపఎన్నికలు అంటూ వస్తే… ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ఒక్క సీటుకూడా గెలివదు. ఆఖరికి పులివెందులలో కూడా జగన్ ఓడిపోయి. టీడీపీ లేదా కూటమి అభ్యర్థి గెలవడానికి ఛాన్సుంది. అధికార పార్టీని కాదని.. మళ్ళీ ప్రతి పక్ష ఎమ్మెల్యేలను జనం గెలిపించే అవకాశం ఉండదు. అందుకే… ఏదైతే అది అయింది. అనుకొని… వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి రావాల్సిందే. లేకపోతే ఆ పార్టీకి కోలుకోలేని నష్టం జరిగే ఛాన్సుంది. అసెంబ్లీకి డుమ్మా కొడితే… ఆ తర్వాత తాము ప్రజా సమస్యలపై పోరాడామని చెప్పుకోడానికి కూడా వైసీపీకి ఛాన్సుండదని విశ్లేషకులు చెబుతున్నారు.