Credit Card New Rules : బిల్లు పెండింగ్ పడితే ఇక బాదుడే… క్రెడిట్ కార్డులపై RBI కొత్త రూల్స్ !!

క్రెడిట్ కార్డులు (Credit Cards) వాడుకునేటప్పుడు తెలియదు. కానీ బిల్లు కట్టేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి. అందుకే బిల్లు పెండింగ్ పడితే ఇక నుంచి వినియోగదారులపై భారీగా భారం పడనుంది.

క్రెడిట్ కార్డులు (Credit Cards) వాడుకునేటప్పుడు తెలియదు. కానీ బిల్లు కట్టేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి. అందుకే బిల్లు పెండింగ్ పడితే ఇక నుంచి వినియోగదారులపై భారీగా భారం పడనుంది. వాళ్ళకు ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ కార్డు (Interest free credit card) సౌకర్యాన్ని కోల్పోతారు. అంటే బిల్లింగ్ డేట్ నుంచి అప్పటిదాకా పెండింగ్ ఉన్న అమౌంట్ చెల్లించడానికి బ్యాంకులు 45 రోజుల టైమ్ ఇస్తాయి. బకాయిదారులు ఈ అవకాశాన్ని కోల్పోతారు. అంటే మనం కొనుగోలు చేసిన దగ్గర నుంచే వడ్డీ లెక్కించే అవకాశం బ్యాంకులు ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) విడుదల చేసిన కొత్త గైడ్ లైన్స్ ఏంటో చూద్దాం.

  •  డెబిట్ లేదా క్రెడిట్ కార్డుదారుడికి తెలియకుండా అతని పర్సనల్ డేటా, లావాదేవీలను వేరే వాళ్ళకి షేర్ చేయకూడదని RBI ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు… కార్డుదారులు తమ వాడకానికి సంబంధించి మానిటరింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని ఆదేశించింది. ఎవరైనా కస్టమర్లు తమ సమాచారాన్ని వేరే ఏజెన్సీలకు ఇవ్వమని అంగీకారం తెలిపితే బ్యాంకులు అప్పుడు షేర్ చేయాల్సి ఉంటుంది.

 

  • క్రెడిట్ లేదా డెబిట్ కార్డుకు అప్లయ్ చేసినప్పుడు… వాళ్ళకి ఇష్టమైన నెట్ వర్క్ ను ఎన్నుకునే అవకాశం కస్టమర్లకు ఉంటుంది. అంటే అమెరికన్ ఎక్స్ ప్రెస్ బ్యాంకింగ్, డైనర్స్ క్లబ్, మాస్టర్ కార్డ్, NPCI-రూపే, వీసా కార్డుల్లో ఏ నెట్వర్క్ ని అయినా వినియోగదారుడు కోరుకోవచ్చు.

 

  • కస్టమర్లకు తెలపకుండా బ్యాంకులు ముందస్తుగా ఎలాంటి కార్డులను జారీ చేయరాదని RBI ఆదేశాలు ఇచ్చింది. కొత్త కార్డు ఇష్యూ చేసేటప్పుడు కస్టమర్ కు తప్పనిసరిగా తెలపాలి. వాళ్ళ అనుమతిని OTP లేదా ఇతర మార్గాల్లో తీసుకోవాలి. తెలియకుండా కార్డు జారీ చేస్తే… దాన్ని రద్దు చేసుకునే అవకాశం కస్టమర్ కి ఉంటుంది. అంతేకాదు… అనుమతి లేకుండా జారీ చేసిన కార్డుకు సంబంధించి ఎలాంటి ఫీజులు, వడ్డీలు, పెనాల్టీలు, ట్యాక్సులు వసూలు చేయరాదు. వారం రోజుల్లోపు ఆ కార్డును రద్దు చేయాలి. క్లోజ్ చేసిన విషయం కస్టమర్ కి తెలియజేయాలి.

 

  • క్రెడిట్ కార్డులు బిల్లింగ్ డేట్ కు సంబంధించి అన్ని బ్యాంకులు ఖచ్చితమైన డేట్స్ పాటించడం లేదు. ఇక నుంచి బిల్లింగ్ డేట్, పేమెంట్ డేట్స్ నిర్ణయించుకునే అధికారం కస్టమర్ కి ఇవ్వాలి. ఈ రెండు డేట్స్ లో కనీసం ఒక్కటైనా తనకు ఇష్టమైన డేట్ ను ఎంచుకోవచ్చు.

 

  • బిల్లింగ్ డేట్ మార్చుకోడానికి హెల్ప్ లైన్ లేదా ఈమెయిల్, IVR, ఇంటర్నెట్ బ్యాంకింగ్ (Internet Banking), మొబైల్ యాప్స్ ద్వారా కస్టమర్లకు అవకాశం కల్పించాలి.

 

  • క్రెడిట్ కార్డులకు మొత్తం పెండింగ్ బకాయి చెల్లించకుండా చాలా మంది మినిమమ్ పేమేంట్ చేస్తుంటారు. ఇలా మినిమం పేమెంట్స్ చేయడం వల్ల కలిగే అనర్థాలను కార్డుదారులకు ఆయా బ్యాంకులు వివరించాలి. దీని వల్ల కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా వేస్తారన్నది స్టేట్ మెంట్ లో ఖచ్చితంగా చూపించాలి.

 

  • క్రెడిట్ కార్డులను వ్యాపారులకు, వ్యక్తిగత అవసరాలకు వాడుకునే వారికి విడి విడిగా జారీ చేయాలి. బిజినెస్ క్రెడిట్ కార్డులకు ఛార్జ్ వసూలు చేస్తారు. కార్పొరేట్ క్రెడిట్ కార్డులకు క్రెడిట్ సౌకర్యం, ఓవర్ డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్ సౌకర్యాలను కల్పించవచ్చు. వీటిని బిజినెస్ పర్సస్ వాడుకుంటారు.

 

  • డెబిట్ లేదా క్రెడిట్ కార్డులకు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధన విధించకూడదు. ఒకవేళ కార్డుదారుడి అంగీకారంతో ఇన్సూరెన్స్ ని ఉచిత కాంప్లిమెంటరీగా లేదంటే కొంత డబ్బులు వసూలు చేయవచ్చు. అందుకోసం కార్డుదారుడి అనుమతి తీసుకోవాలి. అలాగే ఆ ఇన్సూరెన్స్ కి సంబంధించి నామినేషన్ డిటైల్స్ సేకరించాలి. నామినీ పేర్లను తెలియజేయాలి. ఇన్పూరెన్స్ యాడ్ చేసినట్టుగా ప్రతి క్రెడిట్ లేదా డెబిట్ కార్డు స్టేట్ మెంట్ లో చూపించాలి.

 

  • కార్డుల విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే బ్యాంకులు లేదా ఏజెన్సీలకు కస్టమర్లు కంప్లయింట్ చేయవచ్చు. ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోపు సంబంధిత బ్యాంక్ లేదా సంస్థ అధికారులు స్పందించకపోతే… RBI అంబుడ్స్ మన్ కు కంప్లయింట్ చేయొచ్చు. మెయిల్ ద్వారా గానీ లేదంటే ఫిజికల్ గా కూడా ఫిర్యాదు పంపవచ్చు.