5 నిమిషాలు పోలీసులు వదిలేసి ఉంటే… కొంపముంచిన వరద…!

ఇటీవల ఎన్టీఆర్ జిల్లాను వరదలు ఏ స్థాయిలో ముంచెత్తాయి అనేది అందరికి తెలిసిందే. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై కూడా పెద్ద ఎత్తున వరద రావడంతో రాకపోకలను నిలిపివేశారు. అయితే ఇక్కడ పోలీసులు ముందుచూపు వాహన యజమానుల కొంప ముంచింది.

  • Written By:
  • Updated On - September 3, 2024 / 01:57 PM IST

ఇటీవల ఎన్టీఆర్ జిల్లాను వరదలు ఏ స్థాయిలో ముంచెత్తాయి అనేది అందరికి తెలిసిందే. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై కూడా పెద్ద ఎత్తున వరద రావడంతో రాకపోకలను నిలిపివేశారు. అయితే ఇక్కడ పోలీసులు ముందుచూపు వాహన యజమానుల కొంప ముంచింది. ఆ ఐదు నిమిషాలు తమను పంపించి ఉంటే బాగుండేది అని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఐతవరం వద్ద వాహనాలు కోల్పోయిన యజమానులు ఆవేదన వ్యక్తం చేసారు.

ఐతవరం వద్ద కొట్టుకుపోయిన కార్లు , బైక్ యజమానుల పోలీసులపై మండిపడుతున్నారు. వరదరాక తక్కువగా వస్తున్న సమయంలోనే వెళతామంటే వద్దని పోలీసులు ఆపారు అని తమ వాహనాలు వెళ్లి ఉంటే 13 కార్లు వరదలో కొట్టుకు పోయేవి కావు అన్నారు. తమ వాహనాల్లో ఉన్న డబ్బు నగదు తమ సామాగ్రి కొట్టుకుపోయాయి అని ఆవేదన వ్యక్తం చేసారు. వాహనాలు బయటకు తీసుకురావాలంటే ఒక్కో వాహనానికి 20000 రూపాయలు వరకు ఖర్చు అవుతుందన్నారు. లోపలికి వెళ్లడానికి అవకాశం లేక ట్రాక్టర్లు ఎడ్ల తో వాహనాలను బయటకు తీసుకువస్తున్నారు.