New Traffic Rules : ఇకపై ఇలా డ్రైవ్ చేస్తే జైలుకే..! తస్మాత్ జాగ్రత

తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలులోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తున్న కేసులే ఎక్కువగా వచ్చాయాని.. రాంగ్ సైడ్ వల్లే మరణాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు నిర్ధారించారు.

 

 

 

విశ్వనగరం అయిన హైదరాబాద్ లో ప్రజలు వాహనాలపై బయటకు రావాలంటే.. భయం భయంతో జంకుతున్నారు. మనం సరిగ్గా వెళ్లిన అవతలి వాడు ఎలా వస్తున్నాడో అన్ని ప్రాణాలు ఆర చేతిలో పెట్టుకోని వాహనాలను నడపాల్సి వస్తుంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు.

తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలులోకి వస్తున్నాయి.
ఇటీవల కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తున్న కేసులే ఎక్కువగా వచ్చాయాని.. రాంగ్ సైడ్ వల్లే మరణాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు నిర్ధారించారు. అది ఎంతలా అంటే ట్రాఫిక్ పోలిస్ ఉండే సర్కిల్స్ వద్ద కూడా రాంగ్ రూట్ లో వాహనాలు నడుపుతున్నారు. దీంతో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినంగా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనంలో ఓ నిర్ణాయికి వచ్చారు.

ఇక నుంచి రాంగ్ రూట్‌లో వాహనం నడిపితే మూడేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. ఇకపై రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపి పట్టుబడితే.. 336 సెక్షన్ కింద కేసు ఫైల్ చేస్తారు. అంతటితో అయిపోతుంది అంటే అది మీ ముర్ఖతంమే అవుతుంది. అలా 336 సెక్షన్ కింద కేసు నమోదై.. లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేసి, చార్జీషీట్‌ ఫైల్ చేస్తున్నారు. ఈ కేసుల్లో మూడేండ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

5 నెలల్లో 40 లక్షల కేసులు!

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు భారీ నమోదవుతున్నాయి. ఈ ఏడాది 5 నెలల వ్యవధిలోనే మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 40 లక్షల కేసులు నమోదయ్యాయి. అయితే.. ట్రాఫిక్ సమస్య పెరగడంతోనే ఇలా అధికంగా కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. కొన్నిసార్లు అరకిలోమీటర్ దూరానికే.. గంటకుపైగా సమయం పడుతుండడంతో, వాహనదారులు అడ్డదారుల్లో వెళ్తుండటం, దీంతో కేసులు నమోదు పెరుగుతుందని సమాచారం.