JAGAN, KCR : కేసీఆర్ తో దోస్తీ చేస్తే.. ఇలాగే ఉంటుంది !

నాకు నువ్వు... నీకు నేను అంటూ... పాపం జగన్... పోయి పోయి... కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకున్నారు. ఆయన అడుగు జాడల్లో నడిచి ఏపీలో బొక్క బోర్లా పడ్డారు. తెలంగాణలో కేసీఆర్ ని 10యేళ్ళ అహంకారం అధికారం నుంచి దింపితే... అక్కడ ఐదేళ్ళకే ఈడ్చి నేలకొట్టింది.

నాకు నువ్వు… నీకు నేను అంటూ… పాపం జగన్… పోయి పోయి… కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకున్నారు. ఆయన అడుగు జాడల్లో నడిచి ఏపీలో బొక్క బోర్లా పడ్డారు. తెలంగాణలో కేసీఆర్ ని 10యేళ్ళ అహంకారం అధికారం నుంచి దింపితే… అక్కడ ఐదేళ్ళకే ఈడ్చి నేలకొట్టింది. కనీసం కేసీఆర్ కి 39 సీట్లయినా తెలంగాణ అసెంబ్లీలో దక్కాయి. కానీ ఆయన ఫ్రెండ్ జగన్ మాత్రం… 14 సీట్ల దగ్గరే ఆగిపోయారు. మొన్నటికి మొన్న ఎన్నికల ముందు కూడా … నాకున్న సమాచారం ప్రకారం జగన్ మరోసారి సీఎం అవుతారని కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా జోస్యం చెప్పారు. కానీ వీళ్ళకే ఇక్కడ టికానీ లేకుండా పోయింది.

పైగా జగన్ ఏపీలో మళ్ళీ అధికారంలోకి వస్తే… ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేసి… మళ్ళీ అధికారం చేపట్టాలని కేసీఆర్ అండ్ కో కలలు కన్నారు. కానీ జగన్ ని దారుణంగా ఇంటికి పంపేశారు ఏపీ జనం. కేసీఆర్ అహంకారంతో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయేలా చేస్తే… జగన్ కి అంతకు మించి అహంకారంతో… వైసీపీ నామరూపాల్లేకుండా పోయింది. ఇద్దర్నీ వాళ్ళ అహంభావమే మింగేసిందని అంటున్నారు.

కేసీఆర్ తో సహవాసం చేయడమే జగన్ ను కూడా ముంచేసింది. కేసీఆర్ నుంచి ఆయన తప్పులు, అహంకారం, నిరంకుశత్వానికి తోడు… ప్రతిపక్షాలు, జనం అంటే లెక్కలేనితనంతో వ్యవహరించారు. అందుకే అధికారం కోల్పోయారు. మరి వీటిని నుంచి జగన్ పాఠాలు నేర్చుకోవాలి కదా… కానీ ఎన్నికల ముందు వరకూ… చెట్లు కొట్టివేయిచి… రోడ్ల పక్కన పరదాలు కట్టించుకొని… నిరంకుశ చక్రవర్తిలాగా ఏపీలో పాలన చేశారు.

2019 ఎన్నికల్లో కేసీఆర్ తన విజయానికి సహకరించారని జగన్ అనుకున్నారు. ఇటు కేసీఆర్ కు జగన్ ఆర్థిక సాయం చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ అమరావతి నిర్మాణం ఆగిపోవడం, ఆంధ్రకు రావాల్సిన పెట్టుబడులు తెలంగాణకు తరలిపోవడానికే brs ప్రభుత్వమే కారణమన్న విమర్శలు ఉన్నాయి. ఏపీలో అభివృద్ధి ఆగిపోవడంతో… యువత ఉపాధి, ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరుకు వలస పోయారు. తన తప్పులు గ్రహించినా… తెలంగాణలో యువత, నిరుద్యోగుల విషయంలో కేసీఆర్ ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరించారో…జగన్ కూడా దాన్నే ఫాలో అయి చివరకు ఓడిపోయారు.

రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్ర పాలకులతో వైరం పెట్టుకొని… నానా బూతులు తిట్టారు కేసీఆర్. కానీ రాష్ట్ర విభజన తర్వాత జగన్ తో స్నేహం మొదలుపెట్టారు. దాంతో ఆంధ్రప్రదేశ్ కు హాని తలపెట్టే వ్యక్తులతో జగన్ ఎలా స్నేహం చేస్తాడంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. జగన్ సిద్ధం నినాదాన్ని ఎత్తుకుంటే… కేసీఆర్ కూడా దాన్ని ఇక్కడ ఫాలో అయ్యారు. కానీ దోచుకోవడంలో ఇద్దరూ ఒక్కటే అంటూ జనం ఫైర్ అయ్యారు. మొత్తానికి కేసీఆర్ ను ఫాలో అయిన జగన్ నిజాలు గ్రహించులేకపోయారు. అందుకే ఈసారి ఎన్నికల్లో ఇద్దరూ ఫామ్ హౌస్ లకు పరిమితం కావాల్సి వచ్చింది.