BALKA SUMAN : సీఎంని తిడితే ఆ టిక్కెట్ ఇచ్చేస్తారా ?

అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ రూట్‌ మార్చారా? సంచలనాలతో జనం నోళ్ళలో ఉండే ప్రయత్నం చేస్తున్నారా అంటే... అయి ఉండవచ్చన్న సమాధానం వస్తోంది రాజకీయ వర్గాల నుంచి. సైలెంట్‌గా ఉంటే... సొంత పార్టీలోనే దెబ్బపడుతుందని భయపడ్డ సుమన్‌...హాట్ కామెంట్స్ తో లైమ్ లైట్‌లోకి రావాలనుకుంటున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయట.

అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ రూట్‌ మార్చారా? సంచలనాలతో జనం నోళ్ళలో ఉండే ప్రయత్నం చేస్తున్నారా అంటే… అయి ఉండవచ్చన్న సమాధానం వస్తోంది రాజకీయ వర్గాల నుంచి. సైలెంట్‌గా ఉంటే… సొంత పార్టీలోనే దెబ్బపడుతుందని భయపడ్డ సుమన్‌…హాట్ కామెంట్స్ తో లైమ్ లైట్‌లోకి రావాలనుకుంటున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయట. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల్ని చూస్తుంటే అదే నిజమని అనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) టైంలో బీఆర్‌ఎస్‌ (BRS) కేడర్‌లో జోష్‌ నింపడానికి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే అలా మాట్లాడారా… అన్న చర్చ కూడా జరుగుతోంది.
ఇటీవల సీఎంను ఉద్దేశించి తీవ్ర అభ్యంతరకర పదజాలం వాడారు బాల్క సుమన్‌(Balka Suman). ఆ మాటలే ఇప్పుడు జిల్లాలో పొలిటికల్‌ (Political) మంటలు పుట్టిస్తున్నాయి.

మంచిర్యాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీలోని కొంతమంది లీడర్లే అసహ్యించుకునేలా సుమన్ వ్యాఖ్యలున్నాయన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. బాల్క సుమన్‌ వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్‌ నేతలు… పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు బుక్‌ అయింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సుమన్ వ్యతిరేక ఉద్యమం చేస్తున్నాయి. దిష్టిబొమ్మలు దగ్ధం చేయడంతోపాటు ఆయన ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలకు చెప్పుల దండలతో శవయాత్ర చేస్తున్నారు. ఓడిపోయాక కూడా అంత అహంకారం పనికిరాదంటూ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వార్నింగ్‌ ఇస్తున్నారు. అదే సమయలో సుమన్‌ తీరుపై బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. బెల్లంపల్లి నియోజకవర్గ సమావేశంలో ఒక్కరిద్దరు సీనియర్ నేతలు సుమన్ టార్గెట్ గా విమర్శలు చేసినట్టు తెలిసింది. బెల్లంపల్లి మీటింగ్‌కు ఆయన దూరంగా ఉండటంతో… ముఖ్యమైన సమావేశానికి జిల్లా అధ్యక్షుడే రాకపోవడం ఏంటన్న ప్రశ్నలు వచ్చాయట.

ఇదే అదనుగా పార్టీలో ఆయన పనైపోయిందంటూ ప్రత్యర్ధులు ప్రచారానికి తెరలేపినట్టు తెలిసింది. ఇలా రకరకాలుగా ఇంటా బయటా పెరుగుతున్న వత్తిళ్ళు, విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సుమన్‌… గట్టిగా నోరెత్తి అన్నిటికీ చెక్‌ చెప్పాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే వాళ్ళు వీళ్లు కాకుండా ఏకంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి… లైమ్‌ లైట్‌లోకి వద్దామనుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. పెద్దపల్లి ఎంపీ స్థానం ఎస్సీ రిజర్వు కాబట్టి… ఈసారి అక్కడి నుంచి పోటీ కోసం ప్రయత్నిస్తున్నారట సుమన్‌. ఆ క్రమంలోనే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారా అన్న అనుమానాలు సైతం వస్తున్నాయట. తాను స్టేట్‌ లీడర్‌నని చెప్పుకునే క్రమంలోనే అలా మాట్లాడి ఉంటారన్న మరో వాదన సైతం ఉంది. మొత్తంగా బాల్క సుమన్‌ వివాదాస్పద వ్యాఖ్యల చుట్టూ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పెద్ద రాజకీయమే నడుస్తోంది.