ఇక విషయంలోకి వెళితే..
ప్రస్తుతం కర్ణాటకలో ఎవరిని కదిపిన ఇవే ప్రశ్నలు..
తెలంగాణ పక్క రాష్ట్రం అయిన కర్ణాటకలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం.
కర్ణాటకలో నివసించే ప్రతి ఒక్కరూ కూడా కన్నడ తప్పక నేర్చుకోవాలని ఆ రాష్ట్ర CM సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ‘కన్నడ తప్ప ఇంకో భాష మాట్లాడమని కర్ణాటక ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి అని సీఎం సిద్ధరామయ్య అన్నారు. కన్నడిగులు ఉదారవాదులు.. అందుకే ఇక్కడ కన్నడ నేర్చుకోకుండానే ఇతర భాషలు మాట్లాడేవారు నివసించగలుగుతున్నారు. అందుకే మనం మాతృభాషలో మాట్లాడాలి’ అని ఆయన అన్నారు. బెంగళూరులోని కర్ణాటక శాసనసభ పశ్చిమ ప్రవేశ ద్వారం వద్ద నాడ దేవి భువనేశ్వరి కాంస్య విగ్రహ ఏర్పాటు భూమి పూజ సందర్భంగా ఆయన ఈ విధంగా మాట్లాడారు. కన్నడ భాషను, నేలను, నీటిని కాపాడుకోవడం ప్రతి కన్నడిగుల బాధ్యత అని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ భాషను నేర్చుకోవాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. కన్నడియులకు మాతృభాషలో మాట్లాడటం గర్వకారణంగా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితి లేదని కర్ణాటక సీఎం పేర్కొన్నారు. ఇక్కడ కూడా స్థానిక భాషలోనే మాట్లాడాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కన్నడలో మాత్రమే మాట్లాడతామని ప్రతిజ్ఞ చేయాలని కోరారు.
గతంలో కూడా బెంగళూరులో హిందీ వర్సెస్ కన్నడ భాష వివాధం దేవ స్థాయిలో చర్చ జరిగింది. కర్ణాటకలో లోని బెంగళూరు, బళ్లారి, యాద్గిర్, మైసూర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో అక్కడి షాప్స్, దుకాణాలకు ఉండే బోర్డులు కన్నడలో కాకుండా హిందీలో ఉంచారు. దీంతో అక్కడి కన్నడీయులు బెంగళూరు నగర మహా పాలక సంస్థతో కలిసి షాప్ పై ఉన్న హిందీ బోర్డ్ లను దుకాణాలను ద్వంసం చేశారు. మరి కొందరికి శాంతితో హిందీ పేర్లకు బదులుగా.. కన్నడ పేర్లు పెట్టాలని హెచ్చరించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నేమ్ ప్లేట్ పై 60 శాతం కన్నడ పదాలను ఉపయోగించాలని అక్కడి నగర పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి కఠిన చర్యలు తీసుకుంటామని బృహత్ బెంగళూరు మహానగర పాలిక చీఫ్ కమిషనర్ తుషార్ గిరి నాథ తెలిపారు.
మరోవైపు వివిధ ఉద్యోగాల చేసి కర్ణాటక రాష్ట్రానికి వచ్చిన పోలీసులుగానీ, IAS, IPS అధికారులు గానీ.. బ్యాంకు ఉద్యోగులు గానీ తప్పని సరిగా కన్నడ రావాలని.. ఆ రాష్ట్రం హుకుం జారీ చేసింది.
Suresh SSM