Revanth Reddy Warning : తప్పు రాస్తే తాట తీస్తాం.. యూట్యూబ్‌ ఛానెళ్లకు సీఎం వార్నింగ్‌

సమాజంలో ప్రస్తుతం సోషల్‌ మీడియా (Social Media) ఎలాంటి రోల్‌ ప్లే చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటోంది కాబట్టి సోషల్‌ మీడియా.. ముఖ్యంగా యూట్యూబ్‌ వాడేవాళ్ల సంఖ్య భారీ స్థాయిలో ఉంటోంది.

సమాజంలో ప్రస్తుతం సోషల్‌ మీడియా (Social Media) ఎలాంటి రోల్‌ ప్లే చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటోంది కాబట్టి సోషల్‌ మీడియా.. ముఖ్యంగా యూట్యూబ్‌ వాడేవాళ్ల సంఖ్య భారీ స్థాయిలో ఉంటోంది. మంచో చేడో.. సోషల్‌ మీడియాలో వార్త పడిందంటే ప్రతీ ఒక్కరికీ అది రీచ్‌ అవుతుంది. మంచితో పాటు చెడు కూడా అదే స్థాయిలో విస్తరించే ప్రమాదం కూడా ఉంది.

ఇదే క్రమంలో ప్రభుత్వంపై సోషల్‌ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను కట్టడి చేసే ప్రక్రియ మొదలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సుదీర్ఘ చర్చలు కూడా నిర్వహించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై ఎవరైనా దుష్ప్రచారం చేస్తే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఉన్న లీగల్‌ ఆప్షన్స్‌పై లీగల్‌ ఎక్స్‌పర్స్ట్‌తో కూడా చర్చించారు రేవంత్ రెడ్డి. ఇప్పటి నుంచి ఎవరు ఏ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలో తప్పుడు ప్రచారం చేసినా వెంటనే వాళ్లపై చర్యలు తీసుకునేలా యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేయాలని నిర్ణయించారు.

రీసెంట్‌ తెలంగాణ విద్యాశాఖపై ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో వచ్చిన వార్తతో సీఎం సోషల్‌ మీడియాపై ఫోకస్‌ చేశారు. ఆ యూట్యూబ్‌ ఛానల్‌కు నోటీసులు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ప్రక్రియ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఆధారాలు లేకుండా ఎవరు ఇలాంటి వార్తలు ప్రసారం చేసినా, వాటిని సర్క్యూలేట్‌ చేసిన ఉపేక్షించేది లేదని నిర్ణయించారు సీఎం. చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోడానికి వీలైతే అలాంటి చర్యలు తీసుకుంటామంటూ చెప్పారు.