ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా శ్రీరామ్ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాలేజికి వచ్చిన కుర్రాడు ‘నాకు రష్యన్ అమ్మయి కావాలి.. ఎక్కడ దొరుకుతుంది’ అంటూ చేతిలో పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన ఒక ప్లకార్డు పట్టుకొని కాలేజ్ మొత్తం విచ్చలవిడిగా తిరిగాడు. ఇలా తిరగడమే కాకుండా కొందరికి దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేశాడు. ఇతని వింత ప్రవర్తనను కాలేజి ప్రాంగణంలోని విద్యార్థులు వీడియోలు తీశారు. అలాగే లెక్చరర్లు, స్టాఫ్ తోపాటూ విద్యార్థులు అతని వింత ప్రవర్తనను చూసి షాక్ అయ్యారు. కొందరు మహిళలు భయభ్రాంతులకు గురయ్యారు.
ఈ విషయాన్నికాలేజి యాజమాన్యం పోలీసులకు తెలిపే ప్రయత్నం చేసింది. ఈ లోపు సోషల్ మీడియాలో ఈ వీడియో అటూ ఇటూ షేర్ అయింది. ఇలా త్వరగా వైరల్ అవ్వడంతో సరాసరి పోలీసుల కంట పడింది. ఇక చెప్పేదేముంది. వెంటనే అతని వివరాలు గాలించే పనిలో పడ్డారు పోలీసులు. చివరకు ఆచూకి తెలుసుకున్నారు. అతగాడిని పట్టుకొని పోలీసు స్టేషన్ కి తీసుకెళ్ళారు. ఇలా అభ్యంతరకరంగా ప్రవర్తించినందుకు తమదైన స్టైల్ తో ఆకతాయికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే ఈ వీడియో చూసిన వాళ్లు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ యువకుడిపై మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లకార్డ్ రష్యన్ అమ్మాయిలను ఉద్దేశించి చేసినదిగా భావిస్తున్నారు. దీని అర్థం రష్యన్ అమ్మాయిలంటే చులకన భావంగా, కేవలం శారీరక వాంఛ తీర్చేవాళ్లలాగా అనిపిస్తున్నారా అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పోకిరీగాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు.
For likes on reels, this numbskull was roaming with a placard that read, “Need #Russian (girl) in #Muzaffarnagar” outside girls college. Now local police have arrested him.
Not sure if he knows the #Russianroulette desi version in jails.#UttarPradesh https://t.co/InvClHx7zE pic.twitter.com/IhW76xuWaB
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) June 25, 2023
T.V.SRIKAR