చైనా మనకు ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎందుకంటే మనం చైనాలో లేకపోయిన మన ఇంట్లో మాత్రం చైనా వస్తువులతో నిండిపోయింది. అంతేనా.. మనం వాడుతున్న ప్రతి ఎలక్ట్రానిక్ డివైజ్ చివరికి మీ చేతిలో ఉన్న ఫోన్ కూడా చైనాదే వాడుతున్నాం. ప్రపంచ దేశాలకు అభివృద్ది లో సవాల్ కు ప్రతి సవాల్ ను విసురుతూ ఉంటుంది. చైనా దేశం సాధారణంగా బాతు ఆకారంలో ఉంటుంది అని అంటుంటారు.. చైనా దేశం వరల్డ్ మ్యాప్ లో కాళ్ళు లేని ఆకారపు దేశంగా ఉన్న.. చిరుత కన్నా వేగంగా పరిగెత్తుంది చైనా దేశం.. ఇక విషయంలోకి వెలితే.. పసుపు సముద్రంలో పాన్‌బూడి వద్ద జరిగిన సబ్‌మరైన్ ఘోర ప్రమాదంలో 55 మంది చైనా సైనికులు మరణించారు. చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటన ఎక్కడ జరిగింది..?
ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన ఎల్లో సముద్రంలో ప్రయాణిస్తున్న చైనా న్యూక్లియర్ సబ్‌మరైన్ ప్రమాదానికి గురైంది. విదేశీ వెజిల్స్ కోసం చైనా ఏర్పాటు చేసిన ట్రాప్‌లో చైనా సబ్ మరైన్ నే చిక్కుకుంది. అందులోని 55 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతుల్లో 22 మంది అధికారులు, 7 మంది ఆఫీసర్ క్యాడెట్లు, 9 మంది చిన్న అధికారులు, 17 మంది నావికులు ఉన్నారు. చనిపోయిన వారిలో ” కేప్టెన్ కల్నల్ జూ యంగ్ పెంగ్ ” కూడా ఉన్నారు. చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్ పరిసరాల్లో సంభవించినట్లు స్పష్టం చేసింది యూకే ఇంటలిజెన్స్.
ప్రమాదం ఎలా జరిగింది.. ?
ఈ ఏడాది ఆగస్టు 21న పసుపు సముద్రంలో బ్రిటిష్ నౌకల కోసం చైనా ఏర్పాటు చేసిన ట్రాప్ లో చైనా అణు జలాంతర్గామి చిక్కుకపోయింది. ఈ సమయంలో లంగర్, చైన్ ఆ సబ్‌మరైన్ ముందుకెళ్లకుండా వెనక్కి లాగేశాయి. అక్కడే గంటల పాటు చైనా సబ్ మెరైన్ ట్రాప్ లో చిక్కుకుపోయింది. ఈ సమయంలో సబ్‌మరైన్‌లోని ఆక్సిజన్ సిస్టమ్ పని చేయలేదు. అదే కాకుండా ఆక్సిజన్ సరఫరా కలుషితం కావడంతో విషవాయులు సిబ్బంది పిల్చుకోవడంతో ఈ దారుణ ఘటన జరిగి ఉండవచ్చని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది. ఎమర్జెన్సీ సమయంలో పని చేయాల్సిన సిస్టమ్ కూడా ఆఫ్ అయిపోయింది. ఫలితంగా 55 మంది నేవీ సిబ్బంది ఆక్సిజన్ అందక.. ఉక్కిరిబిక్కిరి అయ్యి కడలి లోతులో కన్ను మూశారు. సబ్ మెరిన్ సముద్రం ఉపరితలం చేయడానికి కనీసం ఆరు గంటల సమయం పడుతుందని నివేదిక పేర్కొంది. అప్పటికే నేవీ సిబ్బంది అంత మృత్యువాత చెందారు.
విపత్తు సమయంలో అహంకర ప్రదర్శన.. !
చైనా మారుతుంది కానీ చైనా మీద ప్రపంచం యొక్క అభిప్రాయం మాత్రం మారట్లేదు.. ఇది మరో పెద్ద ఉదాహరణ.. నిజానికి ఈ ప్రమాదం పై ఇప్పటి వరకు చైనా ప్రభుత్వం స్పందించలేదు. ఈ ఘటనను కూడా బయటపెట్టింది యూకే ఇంటెలిజెన్స్. ఈ ఘటనలో 55 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చైనా PLA నేవీ సబ్‌మరైన్ ‘093-417’ కేప్టెన్ కూడా ఉన్నారు అని యూకే ఇంటిలిజెన్స్ నివేదికను చైనా మాత్రం అలాంటిదేమీ జరగలేదని ఖండిస్తోంది. సముద్రంలో చిక్కుకుపోయిన ఆ సబ్‌మరైన్‌కి అంతర్జాతీయ సహకారమూ అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే.. యూకే రిపోర్ట్ మాత్రం ఈ ఘటన జరిగిందని చెబుతోంది. అయితే ఈ ఘటనను చైనా అధికారికంగా ఖండించింది. అదనంగా, బీజింగ్ జలాంతర్గామి కోసం అంతర్జాతీయ సహాయాన్ని కోరేందుకు కూడా చైనా నిరాకరించినట్లు సమాచారం. మృతుల్లో 22 మంది అధికారులు, 7 మంది ఆఫీసర్ క్యాడెట్లు, 9 మంది చిన్న అధికారులు, 17 మంది నావికులు ఉన్నారు. కాగా వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని యూకే నివేదికను చైనా కొట్టిపడేసింది.
గతంలో కూడా భారత్-చైనా సరిహద్దు విషయంలోనూ గాల్వాన్ లోయలో ఘర్షణలు జరిగినప్పుడు చైనా జవాన్లు దాదాపు 42 మంది మరణించగా.. కేవలం ఈ ఘటనలో 19 మరణించినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. మీడియాలో కథనాలు ప్రచురించింది. చైనా ఏ సమయంలోనైనా.. ప్రభుత్వం చేసిన తప్పులను ఆ దేశం ఎట్టి పరిస్థితుల్లో బాహ్యప్రపంచానికి తెలియనివ్వదు.అదే తరహాలో 2020లో చైనా ఉద్దేశ పూర్వకంగా కరోనా వైరస్ ను వుహాన్ ల్యాబ్ లో తయారు చేసింది అని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్న.. ఇప్పటికి ఆ విషయంపై సరైన సమాధానం చైనా నుంచి రాలేదు.
చైనీస్ జలాంతర్గామి తన సొంత ఉచ్చులోకి ఎలా వెళ్ళింది..?
ఎవరు తీసిన గోతిలో వారే పడతారు.. అంటే ఇదేనేమో..
యుఎస్, అనుబంధ జలాంతర్గాములను తమ వలలో వేసుకోవడానికి చైనా నావికాదళం ఏర్పాటు చేసిన చైన్ యాంకర్ అడ్డంకితో చైనా జలాంతర్గామి ఢీకొట్టిందని యూకే నివేదిక తెలిపింది. ఈ ఢీకొట్టిన ఘటనలో ఆక్సిజన్ సరఫరా కలుషితం కావడం వల్ల సిబ్బంది విషపూరితంగా చనిపోయారని స్పష్టం చేసింది.
ఈ ఘటనపై ఇంకా అధికారిక స్పష్టత ఇవ్వని చైనా..
చైనా ముర్క వాదనలు ఖండించిన ప్రపంచ దేశాలు.. ప్రస్తుతానికి, ప్రజలకు అందుబాటులో ఉన్న చైనీస్ జలాంతర్గామి యొక్క ఊహాజనిత నష్టం.. ఇంకా బాహ్య ప్రపంచానికి చైనా ధృవీకరణ లేదు. బీజింగ్ ఈ సంఘటనకు సంబంధించిన వాదనను ‘పూర్తిగా అవాస్తవం’ అని తిరస్కరించింది. తైవాన్ కూడా ఈ చైనా వాదనను ఖండించింది.
చైనా సబ్ మెరైన్..
చైనా సబ్ మెరైన్ సుమారు.. 351 అడుగుల పొడవు, టార్పెడోతో అమర్చబడి ఉంటుంది. చైనీస్ టైప్ 093 జలాంతర్గాములల్లో ఇది ఒకటి.. గత 15 సంవత్సరాలుగా ఈ సబ్ మెరిన్ పనిచేస్తుంది. ఇవి చైనా యొక్క సమకాలీన సబ్‌మెర్సిబుల్స్‌గా పరిగణించబడ్డాయి.
S.SURESH