Narendra Modi: ఇండియా పేరు ఎప్పుడో మార్చేశారు.. ఇదిగో ప్రూఫ్‌..

ఇండియా పేరును భారత్ గా మార్పు వెనక మోదీ పాత్ర కీలకంగా ఉంది.

  • Written By:
  • Publish Date - September 6, 2023 / 11:17 AM IST

జీ20 సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా నుంచి విడుదలైన ఇన్విటేషన్‌ ఇప్పుడు రాజకీయ దుమారాన్ని లేపుతోంది. ఈ ఇన్విటేషన్‌లో ఇండియా ప్లేస్‌లో భారత్‌ అని ఉండటంతో దేశం పేరు మార్చేస్తున్నారంటూ పెద్ద చర్చ మొదలైంది. ఆగస్ట్‌లో దక్షిణాఫ్రికాలో జరిగిన 15వ బ్రిక్స్‌ సమావేశానికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే ఆ నోటిఫికేషన్‌లో కూడా ఇండియా ప్లేస్‌లో భారత్‌ ఉంది. ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ ఇండియా అని ఉండాల్సిన ప్లేస్‌లో ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ భారత్‌ అని ముద్రించారు. అది మాత్రమే కాదు. దాని తరువాత ప్రధాని మోదీ చేపట్టిన గ్రీస్‌ పర్యటనలో కూడా ఇండియా స్థానంలో భారత్‌ అని మాత్రమే ప్రస్థావించారు.

దాదాపు ఆగస్ట్‌ నెలలో ప్రధాని ఎన్ని పర్యటనలు చేశారో అన్నిపర్యటనల్లో ఇండియా ప్లేస్‌లో భారత్‌ అని ముద్రిస్తూనే ఉన్నారు. నేటి నుంచి ప్రారంభం కానున్న తూర్పు ఆసియా, ఇండోనేషియా ఏషియన్‌ సదస్సుల్లో కూడా ఇండియా ప్లేస్‌లో భారత్‌ అనే ఉంది. దీంతో ఇది ఇప్పుడు మరో చర్చకు దారి తీస్తోంది. ఇండియా పేరు ఎప్పుడో మార్చేశారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశ ప్రజలకు కనీస సమాచారం లేకుండా దేశం పేరు ఎలా మారుస్తారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దేశం పేరు మారిందని నోటిఫికేషన్‌లో చూసి తెలుసుకునే దుస్తితి ప్రజలకు పట్టించారంటూ ఆరోపిస్తున్నారు. ప్రెసిడెంట్ ఆఫ్‌ ఇండియా నుంచి ఒక లేఖ కూడా లేకుండా ఇండియా పేరును మార్చడం ప్రజాస్వామ్యాన్ని అగౌరవపర్చడమే అంటున్నాయి ప్రతిపక్షాలు.