Andesree, Keeravani : అందెశ్రీ, కీరవాణికి పోటీగా.. జూన్‌ 2న మిట్టపల్లి తెలంగాణ సాంగ్‌..

తెలంగాణ (Telangana) గీతం గురించి జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందెశ్రీ (Andesree) వ్యాఖ్యలు కొత్త కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నాయ్.

తెలంగాణ (Telangana) గీతం గురించి జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందెశ్రీ (Andesree) వ్యాఖ్యలు కొత్త కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నాయ్. తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతం సమకూర్చేందుకు తెలంగాణలో సంగీత దర్శకుడే లేడా అని కొందరు అంటుంటే.. కీరవాణి (Keeravani) అయితే తప్పేంటి అని అందెశ్రీ మాట్లాడిన ఓ ఫోన్‌ కాల్ తెగ వైరల్ అవుతోంది. ఐతే గీతం బాధ్యత అంతా అందెశ్రీకి అప్పగించామని.. సీఎం రేవంత్‌ చేతులు దులుపుకున్నారు. దీంతో గేయం.. సోషల్‌ మీడియాలో గాయం రేపుతోంది.

ఇలాంటి పరిస్థితుల మధ్య అందెశ్రీ, కీరవాణికి పోటీగా మిట్టపల్లి సురేందర్ టీమ్ రంగంలోకి దిగింది. జయజయహే తెలంగాణకు ధీటుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న అసలు సిసలైన తెలంగాణ గేయం రిలీజ్ చేస్తామని మిట్టపల్లి టీమ్ అంటోంది. తెలంగాణ మట్టి వాసన గుర్తొచ్చేలా సాంగ్ ఉంటుందని చెప్తున్నారు వాళ్లంతా. తెలంగాణ జనాన్ని ఆకట్టుకునేలా పాటలు రాయడంలో, ట్యూన్ చేయడంలో మిట్టపల్లికి మంచి పేరుంది. ఓ ప్రముఖ తెలంగాణ న్యూస్ ఛానల్ కు పాటలు రాసి ఆ ఛానల్ పాపులారిటీలోనూ మిట్టపల్లి కీలక పాత్ర పోషించారు.

ఈ మధ్యే మదర్స్ డే రోజు.. అమ్మ పాడే జోల పాట అంటూ… సరళమైన పదాలతో ఓ పాట రాసి.. సోషల్‌ మీడియాలో కొత్త వైబ్‌ క్రియేట్ చేశారు మిట్టపల్లి. ఇదంతా ఎలా ఉన్నా.. ఇప్పటికే తెలంగాణ గీతంపై సోషల్‌ మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది. ఇలాంటి టైమ్‌లో అసలైన తెలంగాణ పాట అంటూ మిట్టపల్లి రావడం… ఎలాంటి వివాదాలకు దారి తీస్తుంది.. ఎలాంటి సంచలనం అవుతుంది అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. అందెశ్రీ పాట, మిట్టపల్లి పాట ఎలా ఉంటాయన్నది ఆసక్తికర చర్చకు కారణం అవుతోంది.