Europe Bird Flu: యూరప్‌లో ముగ్గురికి బర్డ్‌ఫ్లూ.. కరోనాలాంటి మరో ప్రళయం ఖాయమా ?

ప్రపంచవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ కేసులు భారీగా పెరుగుతున్నాయ్. కోళ్లకు మాత్రమే వచ్చే ఈ వ్యాధి.. మనుషులకు కూడా సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలా హెచ్చరించిందో లేదో.. అన్నంత పని అయింది.

  • Written By:
  • Publish Date - July 17, 2023 / 04:41 PM IST

యూరప్‌లో ముగ్గురికి బర్డ్‌ఫ్లూ సోకింది. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని టెన్షన్ పుడుతోంది. బర్డ్‌ ఫ్లూ వైరస్‌ రకరకాల మ్యూటేషన్ చెందుతూ.. మనుషులకు సోకుతోంది. అటు ఇటుగా కరోనాకు ఉన్న లక్షణాలే బర్డ్‌ ఫ్లూకు ఉంటున్నాయ్. యూరప్‌వ్యాప్తంగా చాలామంది జలుబు, జ్వరం, విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నారు. టెస్టులు చేయించగా.. ముగ్గురికి పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది. దీంతో బర్డ్ ఫ్లూ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా మన దగ్గర మరిన్ని భయాలు కనిపిస్తున్నాయ్. కరోనాతో పోలిక పెట్టుకొని మరీ ఇక్కడి జనాలు వణికిపోతున్నారు.

యూరప్‌లో విజృంభించిన తర్వాతే.. కరోనా ఇండియాకు ఎంటర్ అయింది. రెండేళ్లు చుక్కలు చూపించింది. దీంతో ఇప్పుడు బర్డ్‌ ఫ్లూ కూడా మరో ప్రళయంగా మారుతుందా అనే భయాలు కనిపిస్తున్నాయ్. బర్డ్ ఫ్లూ వ్యాది ప్రబలకుండా అరికట్టడం కోసం ఫౌల్ట్రీ ఫామ్స్ దగ్గర శుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. 2022 లెక్కల ప్రకారం ఐదు ఖండాల్లోని 67దేశాలలో బర్డ్ ఫ్లూ వ్యాపించింది. 131 మిలియన్లకు పైగా దేశీయ ఫౌల్ట్రీలకు సోకింది. ఈ ఏడాది ప్రారంభంలో 14దేశాలకు వ్యాప్తి చెందినట్లు నివేదికలు చెప్తున్నాయ్. ఏవియన్ ఫ్లూ లేదా బర్డ్ ఫ్లూ పక్షులకు వచ్చే ఇన్ఫెక్షన్. అరుదైన సందర్భాల్లో మనుషులను ప్రభావితం చేస్తుంది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ మధ్య కాలంలో నాలుగు వేరియంట్స్ ఆందోళన కలిగిస్తున్నాయ్. బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన పక్షులు, కోళ్లని పట్టుకున్నప్పుడు ఈ వ్యాధి సోకుతుంది. అది జీవించి ఉన్నా లేదా మరణించి ఉన్నా కూడా వ్యాధి వ్యాపిస్తుంది.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం వ్యాధి సోకిన పక్షులు వేసిన రెట్టలు తాకిన, చనిపోయిన కోళ్లను వంటకు ఉపయోగించినా కూడా ఇన్ఫెక్షన్‌కి గురయ్యే అవకసం ఉంది. అయితే పూర్తిగా ఉడికించిన మాంసం, గుడ్లు తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకదు. విపరీతమైన జ్వరం, కండరాల్లో నొప్పి, తలనొప్పి, దగ్గు, ఊపిరి ఆడకపోవడం, అతిసారం, కడుపు నొప్పి, ఛాతీ నొప్పి.. ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.