చైనా (China) దేశంలో గత రెండు రోజులుగా.. భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు (heavy rains) దక్షిణ చైనా (South China) లోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని ప్రధాన నదులు.. భారీ వర్షాలకు ఉప్పెనలా ప్రవహిస్తున్నాయి. శనివారం రాత్రి 8 గంటల నుంచి 12 గంటలకు మొదలైన భారీ వర్షం.. భారీ వరదలకు కారణం అయ్యింది. జావోకింగ్, షావోగ్వాన్, కింగ్యువాన్ – జియాంగ్‌మెన్ నగరాలతో సహా ప్రావిన్స్‌లోని మధ్య – ఉత్తర ప్రాంతాలను రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది.
నదులు (Rivers) – రిజర్వాయర్‌లు ప్రమాదకరమైన స్థాయిలోకి వరద నీరు చేరుకుంటుంది. దీంతో వరదతో నిండిన డ్యాం వాటర్ ను దిగువ ప్రాంతాలకు వదలడం తప్ప మరో మార్గం లేదందునా.. వచ్చిన వరద నీటిని దిగివకు పంపిస్తున్నారు. దీంతో జెబియాంగ్, బీజింగ్ నదుల భీకరంగా ప్రవహిస్తుండటంతో వరదలతో సుమారుగా 12 కోట్ల మంది ప్రజలకు ముప్పునకు గురైవుతున్నట్లు అధికారులు గుర్తించారు.
127 మిలియన్లకు పైగా ప్రజలను రక్షించడానికి అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికలను అమలు చేయమని ప్రభుత్వం ఆదివారం బలవంతం చేసింది.
ప్రస్తుతం దక్షిణ చైనాలోని జెబియాంగ్, బీజింగ్ నదుల భయనకరమైన స్థితుల్లో ప్రవహిస్తున్నాయి. దీంతో పాటుగా.. వాటి ఉప నదులు అయిన బీజియాంగ్ నది కూడా ఇదే స్థాయిలో ప్రవహిస్తుంది. క్షణక్షణకు నదుల నీటి మట్టాలు పెరిగిపోతునే ఉన్నాయి.
చైనా నీటి వనరుల మంత్రిత్వ శాఖ అత్యవసర సమావేశం నిర్వహించింది. క్వింగ్యువాన్‌లో 45,000 మందికి పైగా ప్రజలు అక్కడి ప్రభుత్వం పుణారావస కేంద్రాలకు తరలించింది. వరద ముప్పు ప్రాంతాల వాసులని.. ఎలాంటి ప్రాణ నష్టం వాటిలకుండా.. సురక్షత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారి చేశారు. వరద ప్రజలకు ఆహారం.. దుస్తులు.. నీరు.. బస.. చేసేందుకు విపత్తు సహాయ నిధులు విడుదల చేసింది చైనా..
ప్రస్తుతం ప్రావిన్షియల్ రాజధానిలో 18 మిలియన్ల జనాభా కలిగి ఉండడంతో ప్రజలను ఇళ్లు కాళి చేయించడం కష్టతరమై అయ్యినట్లు అధికారులు వెల్లడించారు. గత రెండు రోజుల్లో.. రోజువారీ వర్షపాతం కన్న 1.97 అంగుళాల పైగానే వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే వచ్చే వారంలో గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్షియల్ భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదు అవుతుందిని అంచనా వేసింది.
SSM