Kerala, Wayanad : కేరళలో శవాల కుప్పలు.. 200 దాటిన మృ*తుల సంఖ్య

కేరళ (Kerala) లోని వయనాడ్‌ (Wayanad) లో ఎక్కడ చూసినా శవాల దిబ్బలే దర్శనమిస్తున్నాయి. దేవభూమి ఇప్పుడు మరుభూమిగా మారిపోయింది.

కేరళ (Kerala) లోని వయనాడ్‌ (Wayanad) లో ఎక్కడ చూసినా శవాల దిబ్బలే దర్శనమిస్తున్నాయి. దేవభూమి ఇప్పుడు మరుభూమిగా మారిపోయింది. పర్యాటకుల స్వర్గధామం లాంటి ప్రాంతం ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడుతోంది. అటు వరదలు ఇటు రాకాసి కొండచరియలు (Landslides) 3 గ్రామాలను ముంచేశాయి. మరోవైపు కేరళ (Kerala) వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rains) కొనసాగుతున్నాయి. దీంతో 8 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మరో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. వయనాడ్‌లో NDRF సిబ్బంది సహాయక చర్యలను వేగవంతం చేశారు. కేరళలోని వయనాడ్‌ శవాలదిబ్బగా దర్శనమిస్తోంది. అటు వరదలు.. ఇటు రాకాసి కొండచరియలు మూడు గ్రామాలను ముంచేశాయి. మరోవైపు కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి.

Wayanad Landslides : కేరళలో ప్రకృతి విలయతాండవం.. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 93కి చేరిన మృతుల సంఖ్య!

దీంతో 8 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మరో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాల (Heavy floods) తో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. వయనాడ్‌లో NDRF సిబ్బంది సహాయక చర్యలను వేగవంతం చేశారు. స్థానిక మసీదులో తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. అటు సహాయక చర్యలను కేరళ సీఎం పినరయి విజయన్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 150 మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. 400 వందల మందకి పైగా బాధితులను కాపాడారు. వాళ్లంతా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. అంతకంతకూ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. టీ ఎస్టేట్‌లో గల్లైంతనవారి ఆచూకీ ఇంకా లభించలేదు. వాళ్లు దాదాపుగా 6 వందల మంది ఉంటారని అంచనా.

Nifa virus : కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం… 15 ఏళ్ల బాలుడికి సోకి వైరస్

ఇక ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి దాదాపు 146 కిలో మీటర్ల దూరంలో కూడా మృతదేహాలు లభ్యమవుతున్నాయి. అంటే వాళ్లంతా వరదలో వందకు పైగా కిలో మీటర్ల దూరం కొట్టుకుపోయి ఉంటారని అదికారులు చెప్తున్నారు. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి. కాలికట్ మిలిటరీ బేస్‌ నుంచి IAF విమానం (IAF aircraft) లో కోజికోడ్‌కు చేరుకున్నారు ఆర్మీ సిబ్బంది. మరోవైపు మిగ్‌ 17, ధృవ్‌ హెలికాప్టర్లను ఎయిర్‌ఫోర్స్‌ రంగంలోకి దించారు. వరద ముంపులో చిక్కుకున్న మృతదేహాలను హెలికాప్టర్‌ ద్వారా తరలించారు. అలాగే గాయపడ్డవారిని హెలికాప్టర్‌ ద్వారా ఆస్పత్రికి తరలించారు ఆర్మీ అధికారులు.