Maharastra: ప్రేమకు పెద్దల అంగీకారం.. కాటిలోనే కళ్యాణం

సాధారణంగా ఎవరైనా ప్రేమించుకుంటే పెళ్లిని ఇంట్లో వాళ్ళ అంగీకారంతో ఘనంగా ఏ గుళ్లోనో, ఫంక్షన్ హాల్లోనో జరుపుకుంటారు. ఇంట్లో పెద్దలు అంగీకరించకుంటే ఆర్యసమాజ్ లేదా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ వీటన్నింటికీ భిన్నంగా శ్మశానంలో పరిణయం ఆడారు ఒక జంట.

  • Written By:
  • Publish Date - July 27, 2023 / 08:10 AM IST

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు ప్రేమికుల పెళ్లికి అంగీకరించిన యువతి తండ్రి తన కుమార్తె పెళ్లిని శ్మశానంలో చేశారు. అది కూడా హంగూ ఆర్భాటాలతో పూర్తి సంప్రదాయబద్దంగా ఘనంగా నిర్వహించారు. శిర్డీ సమీపంలోని రహతా గ్రామానికి చెందిన గంగాధర్ స్థానిక శ్మశానవాటికలో కాటికాపరిగా విధులు నిర్వర్తిస్తున్నరు. వీరిది మహాసంజోగి అనే సామాజిక వర్గం కావడంతో చాలా ఏళ్లుగా వైకుంఠధామాన్నే తన నివాసంగా మార్చుకొని కుటుంబసమేతంగా నివాసం ఉంటున్నారు.

కాటికాపరి కుమార్తె కూడా అక్కడే పుట్టిపెరిగి ఇంటర్ పూర్తి చేసింది. ఈ క్రమంలో మనోజ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. తమ ప్రేమ వ్యవహారం గురించి ఇంట్లో వాళ్లతో చెప్పారు. దీనికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. దీంతో మయూరి తండ్రి ఒక షరతు విధించారు. నా కూతురు పుట్టి పెరిగిన చోటే వివాహం కూడా జరగాలన్నారు. గంగాధర్ ఇలా సంకల్పించగా బంధుమిత్రుల సమక్షంలో వీరి ఇరువురి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

 

T.V.SRIKAR