Maharaja Ravi Teja : 56 ఏళ్ళ వయసులో రవితేజా రిస్క్…?

ఈ మధ్య కాలంలో ఒక స్టార్ హీరో (Star Hero) సినిమా చేయాలంటే ఏళ్ళకు ఏళ్ళు పడుతుంది. చిన్న హీరోలు కూడా తమ సినిమాల మీద ఎంతో ఫోకస్ పెట్టి ఏళ్ళకు ఏళ్ళు సాగదీస్తున్నారు.

 

 

ఈ మధ్య కాలంలో ఒక స్టార్ హీరో (Star Hero) సినిమా చేయాలంటే ఏళ్ళకు ఏళ్ళు పడుతుంది. చిన్న హీరోలు కూడా తమ సినిమాల మీద ఎంతో ఫోకస్ పెట్టి ఏళ్ళకు ఏళ్ళు సాగదీస్తున్నారు. సినిమా విడుదలైన తర్వాత రికార్డులు బద్దలు కొట్టాలి, వంద కోట్లు వసూలు చేయాలంటూ ఎవరి టార్గెట్ లు వాళ్ళు పెట్టుకుని వర్క్ చేస్తున్నారు. మహేష్ బాబు (Mahesh Babu), జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోల సినిమాలైతే రెండేళ్ళు కనీసం పడుతున్నాయి. ప్రభాస్ ఇప్పుడు కాస్త స్పీడ్ పెంచేసి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

బాహుబలి (Baahubali) సినిమాతో వచ్చిన గ్యాప్ ని కవర్ చేస్తున్నాడు. అయితే మాస్ మహారాజ రవి తేజ (Mass Maharaja Ravi Teja) మాత్రం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. మూడేళ్ళ కాలంలో ఏకంగా 8 సినిమాలు విడుదల చేసాడంటే ఏ రేంజ్ లో వెళ్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు 9 వ సినిమా మిస్టర్ బచ్చన్ లైన్ లో ఉంది. 2021 లో క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన ఈ సీనియర్ హీరో… ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా అంటూ వరుస పెట్టి సినిమాలు చేసాడు. సినిమా హిట్టా ఫట్టా అనే దానితో సంబంధం లేకుండా స్పీడ్ పెంచేసాడు.

56 ఏళ్ళ వయసులో అసలు ఎక్కడా కూడా ఎనర్జీ తగ్గకుండా సినిమాలు చేస్తున్నాడు. ధమాకా సినిమాతో వంద కోట్ల క్లబ్ లో కూడా జాయిన్ అయిపోయాడు. వాల్తేరు వీరయ్య వీరయ్య సినిమా కూడా గత ఏడాది రవి తేజాకి మంచి హిట్ ఇచ్చింది. గత ఏడాదే రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు కూడా విడుదల చేసాడు. ఈ రెండు అంతగా ఆకట్టుకోలేదు. కాని ఈ ఏడాది వచ్చిన ఈగల్ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు.

ఇప్పుడు మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) అనే సినిమాను హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో పూర్తి చేసాడు. మరి ఎందుకు ఇలా సినిమాలు చేస్తున్నాడు అనేది తెలియదు గాని… ఆరోగ్యం సహకరించినన్ని రోజులు సినిమాలు చేసేసుకుని తర్వాత గుడ్ బై చెప్పేసి విదేశాలకు వెళ్లి సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నాడని సినీ వర్గాలు అంటున్నాయి. హీరో క్యారెక్టర్ కాకుండా వేరే పాత్రలు వయసు పెరిగిన తర్వాత చేసే అవకాశం ఉన్నా సరే తాను మాత్రం అందుకు రెడీగా లేడని సమాచారం.