Sikkim : సిక్కింలో నిజమైన ఇండియాటుడే ఎగ్జిట్‌పోల్‌.. ఏపీలోనూ ఇదేనా.. కూటమిదే అధికారమా..

థ్రిల్లర్‌ మూవీని మించిన క్యూరియాసిటీ కనిపిస్తోంది ఏపీ ఫలితాల (AP Results) మీద. ఎగ్జిట్‌పోల్స్ (Exit Poll) అనౌన్స్ అయినా.. ఎవరికి వారు మాత్రం ధీమాగానే కనిపిస్తున్నారు.

 

 

థ్రిల్లర్‌ మూవీని మించిన క్యూరియాసిటీ కనిపిస్తోంది ఏపీ ఫలితాల (AP Results) మీద. ఎగ్జిట్‌పోల్స్ (Exit Poll) అనౌన్స్ అయినా.. ఎవరికి వారు మాత్రం ధీమాగానే కనిపిస్తున్నారు. ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అధికారం తమదే అని టీడీపీ(TDP), వైసీపీ (YCP) స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యాయ్. మిగతా సంస్థల సంగతి ఎలా ఉన్నా.. ఇండియా టుడే మై యాక్సిస్‌ ఎగ్జిట్‌పోల్‌ మీద ఇప్పుడు అందరి ఆసక్తి కనిపిస్తోంది. ఈ సంస్థ చేసిన సర్వే చాలాసార్లు నిజం అయింది. తెలంగాణలోనూ ఇండియాటుడే చెప్పిన అంచనాలే నిజం అయ్యాయ్.

ఏపీలో వైసీపీ ఓటమి ఖాయం అని.. కూటమిదే అధికారం అని ఇండియాటుడే మైయాక్సిస్ అంచనా వేసింది. కూటమికి 98 నుంచి 120, వైసీపీకి 55 నుంచి 77 సీట్లు వస్తాయని తెలిపింది. టీడీపీ (TDP) కి 78 నుంచి 96, జనసేన 16 నుంచి 18, బీజేపీ (BJP)కి 4 నుంచి 6 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక ఎంపీ సీట్లకు సంబంధించి.. కూటమికి 21 నుంచి 23, వైసీపీకి కేవలం 2 నుంచి 4 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పింది. దీంతో ఇండియాటుడే మై యాక్సిస్ అంచనాలు నిజం అవుతాయా.. లేదంటే సంచనాలు చూస్తామా అని చర్చ జరుగుతున్న వేళ… అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం ఫలితాలు మరింత టెన్షన్ పెట్టిస్తున్నాయ్.

ఇండియాటుడే (India Today) మైయాక్సిస్ సంస్థ అంచనాలు ఆ రెండు రాష్ట్రాల్లో నిజం అయ్యాయ్. అరుణాచల్‌ప్రదేశ్‌లో బీజేపీకి 44 నుంచి 51 స్థానాలు వస్తాయని ఇండియాటుడే సంస్థ అంచనా వేయగా.. కమలానికి 46 సీట్లు వచ్చాయ్‌. ఇక సిక్కింలో SKM పార్టీకి 24 నుంచి 30స్థానాలు వస్తాయని అంచనా వేయగా.. ఆ పార్టీ 31 స్థానాలు గెలుచుకుంది. ఆ రెండు రాష్ట్రాల ఫలితాలను అంచనా వేసుకుంటున్న కూటమి పార్టీల నేతలు.. అధికారం తమదే అని మరింత స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యారు. ఐతే వైసీపీ మాత్రం.. తగ్గేదే లే అంటోంది. అన్ని రాష్ట్రాలు వేరు ఇక్కడ వేరు.. అద్భుతాలు చూస్తారు అంటోంది.