తమిళనాడులో నిత్య పెళ్లికూతురి బాగోతం.. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్న.. వాస్తవంగా జరిగింది కూడా.. గతంలో మనం నిత్య పెళ్లి కొడుకు గురించి వినే ఉంటాం.. చదివే ఉంటాం.. కానీ నిత్య పెళ్లి కూతురి నిత్య ఘాద ఇప్పుడే చూడడం..
ఇక విషయంలోకి వెళితే..
తమిళనాడు రాష్ట్రంలో మరో నిత్య పెళ్లి కూతురు కథనం తెరపైకి వచ్చింది. డబ్బు, బంగారం కోసం ఆశపడి ఏకంగా 50 మందిని పెళ్లి చేసుకున్న.. అలా నిత్య పెళ్లి కూతురు వేశం వేస్తునే ఉంది. తమిళనాడు రాష్ట్రం తిరుపూర్‌కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్‌లో చూసి సంధ్య అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. తిరువూర్‌కు చెందిన ఓ యువకుడికి పెళ్లిచేసుకునే క్రమంలో సంధ్య బాగోతం బయటపడింది. పెళ్ళైన 3 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పుతో అనుమానం వచ్చి తన ఆధార్ కార్డు చెక్ చేయగా అందులో భర్త పేరు వేరే ఉంది. దీంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించగా సంధ్యను అదుపులో తీసుకొని విచారించగా.. ప్రస్తుతం సంధ్యను తిరువూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య వలలో చిక్కుకున్న ఒక డీఎస్పీ, ఇద్దరు పోలీసు అధికారులతో సహా 50 మందిని పెళ్లి చేసుకుందటా.. వారిలో ముగ్గరు పోలీసు అధికారులు ఉండటం విశేషం.. అంతకు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఇదే మాదిరి గతంలో హర్యానా రాష్ట్ర.. ఢిల్లీలో 50 మంది మహిళలను మోసం చేసి నిత్య పెళ్లి కొడుకు వేశంలో లక్షల రూపాయలు కట్నం కింద తీసుకోని ఉడాయించిండు. తబేష్ కుమార్ భట్టాచార్య అలియాస్ తబేష్ కుమార్ (55) వ్యక్తి జార్ఖండ్ లోని జంషేడ్ పూర్ కు చెందినవాడు. 1992లో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన అమ్మాయిని మొదటిసారి వివాహం చేసుకున్నాడు. ఈ కేటుగాడు ఏకంగా.. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఒడిశా, హైదరాబాద్ తో పాటు పలు దేశ వ్యాప్తంగా పెళ్లిల్లు చేసుకున్నాడు. అందులోనూ.. తబేష్ పెళ్లి చేసుకున్న వాళందరూ కూడా.. న్యాయవాదులు, వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, విద్యావంతులైన మహిళలు ఉండటం గమనార్హం..