BRS Party: ఆ 16 స్థానాలపైనే బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి.. ఎందుకో తెలుసా..?

గతంలో కాంగ్రెస్ 3000 ఓట్ల నుంచి 1000 ఓట్ల కంటే తక్కువ తేడాతో బీఆర్ఎస్ పై విజయం సాధించింది. ఈ అవకాశం కాంగ్రెస్ కు మరోసారి ఇవ్వకూడదని భావిస్తోంది కారు పార్టీ. తన గులాబీ పరిమళాన్ని ఈ 16 స్థానాల్లో గుబాళింపజేసేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది.

  • Written By:
  • Publish Date - October 21, 2023 / 01:55 PM IST

తెలంగాణలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు సమయం దగ్గర పడుతోంది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను పూర్తి స్థాయిలో ప్రకటించింది. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో గతంలో ఎక్కడెక్కడ స్వల్ప మెజారిటీతో ఒడిపోయారో ఈ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈసారి ఎలాగైన గెలిచి తమ ఆధిక్యతను నిరూపించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా లెక్కలు వేసుకోగా దాదాపు 15 స్థానాల్లో గతంలో కాస్త వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించారు. దీనిని అధిగమించడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయాలో తీవ్రంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజా సర్వే ఫలితాలు ఇలా..

తాజాగా నియోజకవర్గాల వారీగా చేసిన సర్వేలో కొన్ని కీలకమైన ఫలితాలు కనిపించాయి. అందులో బీఆర్ఎస్ 7 స్థానాల్లో, కాంగ్రెస్ 4 చోట్ల, బీజేపీ 3 స్థానాల్లో, బీఎస్పీ ఒక చోట స్వల్ప ఓట్ల తేడాతో గెలుపోటములు చవిచూసే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ బలహీనంగా ఉన్నామో గుర్తించే పనిలోపడ్డారు నాయకులు. వాటిని నివారించి విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం గ్రామ స్థాయి నాయకులు, మహిళా సంఘాలతో ప్రధాన పార్టీ నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో బూత్ కమిటీ సభ్యులను నియమించుకోవడంపై కసరత్తును ప్రారంభించింది.

పొత్తుల కోసం ప్రయత్నం..

2018 ఎన్నికల్లో కోదండరామ్ స్థాపించిన తెలంగాణ జన సమితి, సీపీఐ, న్యూడెమోక్రసీ తో పాటూ మరో మూడు స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎన్నికల బరిలో గట్టి పోటీని ఇచ్చారు. దీని కారణంగా కొన్ని ప్రధాన పార్టీలకు విజయావకాశాలు చెయిజారిపోయాయి. ఈ సారి అలా జరగకుంగడా ఉండేందుకు పార్టీల మధ్య పొత్తు, సమన్వయం కోసం కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. దీనికి కారణం గతంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య త్రిముఖ పోటీ నడిచినట్లు చెబుతున్నారు నాయకులు. అందులో భాగంగా గెలిచే అభ్యర్థులను ఏరికోరి ఎంపిక చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.

కాంగ్రెస్ – బీఆర్ఎస్ కు స్వల్ప ఓట్ల తేడా..

కొత్తగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థిపై కేవలం నాలుగు వేల పైచిలుకు ఓట్లతో గెలుపు సాధించారు.
మధిర, కల్వకుర్తి, వికారాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన వారిపై కేవలం మూడు వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇల్లెందు, తాండూరు, మల్కాజిగిరి, సంగారెడ్డి, వైరా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ విజయం సాధించడానికి రెండువేల ఓట్ల తేడాగా గుర్తించారు. తుంగతుర్తి, అంబర్ పేట లో అయితే కాంగ్రెస్ 1000 ఓట్ల తేడాతో గెలిచింది. కోదాడ కాంగ్రెస్ 1000 ఓట్ల కంటే తక్కువ ఆధిక్యం ప్రదర్శించి కారు గుర్తుపై గెలుపు సాధించింది. ఇక ధర్మపురి, ఇబ్రహీంపట్నం, ఆసిఫాబాద్ లలో 500 ఓట్ల కంటే తక్కువ మెజారిటీతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పై గెలుపు సాధించింది.

T.V.SRIKAR