Heavy Rains : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు.. నిండుకుండలా జూరాల.. శ్రీశైలం.. ప్రాజెక్టులు

ఉత్తారిలోనే కాదు.. దక్షిణాదిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ రాష్ట్రాలు అయిన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు దిగువన ఉన్న నదులకు భారీగా వరద నీరు పెట్టెత్తుతుంది. కర్ణాటకలో భారీ వర్షాలకు కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో కృష్ణా నదిపై ఉన్న SRSP, జూరాల ప్రాజెక్టులకు వరద పోటెత్తింది.

ఉత్తారిలోనే కాదు.. దక్షిణాదిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ రాష్ట్రాలు అయిన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు దిగువన ఉన్న నదులకు భారీగా వరద నీరు పెట్టెత్తుతుంది. కర్ణాటకలో భారీ వర్షాలకు కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో కృష్ణా నదిపై ఉన్న SRSP, జూరాల ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరును వదులుతున్నారు. దీంతో ఆ వరద నీరు అంతా వచ్చి తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. SRSP ప్రాజెక్టులోకి 21 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రస్తుతం నీటిమట్టం 315,850 అడుగులుగ వద్ద కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 20వేలు, ఔట్ ఫ్లో 22,877 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 4.951 టీఎంసీల వద్ద కొనసాగుతుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుడండంతో జూరాల నుంచి ఇరిగేషన్ అధికారులు 34, 818 క్యూసెక్కుల వరదను నుంచి 5 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నల్లమల అడవుల గుండ శ్రీశైలం వైపు పరుగులు పెడుతోంది. అటు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండేందుకు ఎంతో సమయం లేదు..

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద..

కర్ణాటక సహా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కృష్ణా ఉపనదులైన ఘటప్రభ, మలప్రభ, భీమా, తుంగభద్రతో మరికొన్ని పాయలు సైతం పొంగిపొర్లుతున్నాయి. దీంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. జూరాల నుంచి ఉదృతంగా వస్తున్న కృష్ణా నది వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టులకు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారుతుంది. ఇక శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో 37,265 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగుల కాగా ప్రస్తుతం 810. 90లకు వరద నీరు చేరింది. దీంతో జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో డ్యామ్ వద్ద ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. శ్రీశైలం కు ఇలాగే వరద కొనసాగితే ఎక్షణంలోనైనా గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు వరద నీటితో నిండితే.. దిగువన ఉన్న మరో ప్రాజెక్టు అయిన నాగార్జున సాగర్ లోకి వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జున సాగర్ నుంచి 4,694 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా… 8,480 క్యుసెక్కుల నీటిని కుడి, ఎడమ కాల్వల ద్వారా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఎగువ నుంచి సాగర్ కు 15 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. దీంతో సాగర్ నీటి మట్టం కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 504.9 అడుగుల నీటి మట్టం ఉంది. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరగడంతో నీటి మట్టం 24 అడుగులకు చేరింది.