అదే ఊపు, అదే జోష్..! వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా.. మరో విక్టరీని తన ఖాతాలోకి వేసుకుంది. శ్రీలంకను ఓడించి ఆసియా కప్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. అసలు సిసలు మజా అంటే ఇది. వరుస విజయాలతో ఊపుమీదుంది టీమిండియా. శ్రీలంక ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. కాక మీదున్న ఈ రెండు జట్లు.. కొలొంబోలో కొమ్ములు మెలేశాయి. ఆద్యంతం మ్యాచ్
ఉత్కంఠ భరితంగా సాగింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి భారత్ గెలించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 214 రన్స్‌కే ఆలౌటయ్యింది. లంక స్పిన్నర్లు బ్యాటర్లను తక్కువ రన్స్‌కే కట్టడి చేశారు. కెప్టెన్ రోహిత్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ పర్వాలేదనిపించారు. కోహ్లీ సహా మిగితా వాళ్లు పెద్దగా ఆడలేదు. చివర్లో అక్షర్ పటేల్ రాణించడంతో స్కోరు రెండు వందలు దాటింది. లంక బౌలర్లలో దునిత్ ఒక్కడే ఐదు వికెట్లు తీయగా, అసలంక నాలుగు వికెట్లు పడగొట్టాడు.
తక్కువ స్కోరుకు పరిమితం కావడంతో టీమిండియా ఓటమి ఖాయమనుకున్నారు. మన ఫ్యాన్స్ కూడా ఆశలు వదిలేసుకున్నారు. ఏదైనా అద్భుతం జరగకపోతుందా అనుకున్నారు. శ్రీలంక బ్యాటింగ్ మొదలు పెట్టింది. ఓపెనర్లు స్టడీగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ భారత ఫేసర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. బుమ్రా ఓపెనర్ నిస్సంకను 6 పరుగులకే పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండిస్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. మూడు బౌండరీలతో జోరుమీదున్న కుశాల్‌ను ఔట్ చేశాడు.
ఆ తర్వాత స్పిన్నర్లు బాధ్యత తీసుకున్నారు. మిగితా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించాడు. జడేజా మరో రెండు వికెట్లు తీశాడు. ఫలితంగా 41.3 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది లంక .