Telugu states cold : తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు, మూడు రోజుల్లో.. పగటి ఉష్ట్రోగ్రతలు తగ్గే అవకాశం..

తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఉష్ట్రోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. విపరీతంగా చలి పెరిగిపోతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నాయి. పొగమంచు కమ్మెయ్యడంతో రహదారుల్లో ముందు ఏం ఉందో కూడా కనిపించడం లేదు. దీంతో పగలు కూడా లైట్లు వేసుకుని వేసుకుని వాహనదారులు వెళ్తున్నారు.

తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ మరో వనుకు పుట్టించే వార్త వెల్లడించింది.. తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరిగే ఛాన్స్ ఉందని.. మరింత తక్కువ ఉష్ణోగ్రతలు పడిపోయి అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాగల రెండు, మూడు రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. గాలులు తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపుకి వీస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దీని కారణంగా ఈ రోజు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే ఛాన్స్ ఉందన్నారు

మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ఏరియాల్లో చలి పంజా విసరడంతో ప్రజలు వణికిపోతున్నారు. మిచౌంగ్ తుఫాన్ తర్వాత నుంచి అల్లూరి జిల్లా పాడేరు ప్రజలు చలితో గజగజా వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువవడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. పొగమంచు దట్టంగా అలుముకుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అరుకు వంటి లోయల్లో పొంగ మంచుతో తెల్లటి పాలసముద్రాన్ని తలపిస్తుంది అక్కడి పర్యవరణం.. దీంతో పర్యటకు తకిడి కూడా పెరిగింది. ఇక వాహనాదారులు పట్టపగలే వాహనాలకు లైట్లు వేసుకుని వెళ్తున్నారు. అయితే, ఏజెన్సీ ఏరియాలో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చలి కొనసాగుంది. ఇక సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి స్టార్ట్ అవుతుంది.