తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly Meetings) లో తీవ్ర చెలరేగింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డిప్యుటీ సీఎం భట్టి సబితా ఇంద్రా రెడ్డి (Sabita Inda Reddy) గురించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. సీఎం ఆందోళన చేపట్టగా.. అభ్యంతరం చెబుతూ వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) సహా ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను (BRS MLAs) మార్షల్స్ అమాంతం ఎత్తుకెళ్లి పోలీస్ వ్యాన్‌లో ఎక్కించారు. అనంతరం వారిని అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ (BRS party) ఆఫీసుకు తరలించారు. బీఆర్ఎస్ మహిళా సభ్యులను అవమానించిన సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని సభ్యులు డిమాండ్ చేశారు.
ఈ విషయంపై ఇవాళ ఉదయం అసెంబ్లీ స్పీకర్‌కు వాయిదా తీర్మానం సైతం ఇచ్చారు. ఉదయం నల్లబ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంతలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీనిపై ప్రభుత్వం చర్చను ప్రవేశపెట్టింది. తమ ఆవేదనను ఎవరూ పట్టించుకోవడంలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆందోళన చేశారు. కేవలం వర్గీకరణ అంశం గురించి మాట్లాడతామంటేనే మైక్ ఇస్తానంటూ స్పీకర్ చెప్పారు. దీంతో బీఆఎర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. లోపల మార్షల్స్ వాళ్లను అడ్డుకోవడంతో.. అసెంబ్లీ బయటకు వచ్చి ధర్నాకు దిగారు. అసెంబ్లీ హాల్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తరువాత నేరు సీఎం ఛాంబర్ ముందు వెళ్లి బైఠాయించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ప్రయత్నించిన మార్షల్స్ నేరుగా కేటీఆర్‌ను అమాంతం ఎత్తుకెళ్లి పోలీస్ వ్యాన్ ఎక్కించారు. మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేశారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణమంతా ఒక్కసారిగా హీటెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వాని, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలకు నేరుగా తెలంగాణ భవన్‌కు తరలించారు పోలీసులు. వ్యాన్‌లో వెళ్తున్న సమయంలో కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రశ్నించే గొంతులను కొన్నేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో రియాక్ట్ అయ్యారు. సబితను అడ్డం పెట్టుకుని బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. మొత్తానికి సీఎం డిప్యుటీ సీఎం సబిత గురించి చేసిన కామెంట్స్‌తో ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఊగిపోయింది.