Income Tax : బడ్జెట్లో ఉద్యోగులకు నిరాశ.. ITలో మార్పులు ఏంటంటే

కేంద్ర బడ్జెట్ లో మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యోగులకు మొండి చెయ్యి చూపించారు. ఐటీ స్లాబ్స్ లో మార్పులు చేస్తారని ఊహించిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది. 2024- 25 సంవత్సరానికి పార్లమెంటులో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె... ఉద్యోగుల ఆదాయం పన్ను స్లాబ్స్ లో ఎలాంటి మార్పులు చేయలేదు.

కేంద్ర బడ్జెట్ లో మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యోగులకు మొండి చెయ్యి చూపించారు. ఐటీ స్లాబ్స్ లో మార్పులు చేస్తారని ఊహించిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది. 2024- 25 సంవత్సరానికి పార్లమెంటులో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె… ఉద్యోగుల ఆదాయం పన్ను స్లాబ్స్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. పాత శ్లాబులే కొనసాగుతాయని చెప్పారు. సకాలంలో TDS చెల్లించకపోవడం ఇకపై నేరం కాదని రిలీఫ్ ఇచ్చారు. అయితే ఇన్ కం ట్యాక్స్ చెల్లింపులను ఇక నుంచీ ఈజీ చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న శ్లాబ్స్ ప్రకారం 3 లక్షల రూపాయల ఆదాయం వరకూ ఎలాంటి పన్ను కట్టనక్కర్లేదు.

ఈ పరిమితిని 5 లక్షలకు పెంచాలని చాలామంది కోరారు. కానీ నిర్మలా సీతారామన్ మాత్రం ఈ బడ్జెట్ లో ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేదు. స్టాండర్డ్ డిడక్షన్ ని 50 వేల నుంచి 75 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. కొత్త ఆదాయపు పన్ను విధానంలో మాత్రం మార్పులు ప్రకటించారు. 3 లక్షల వరకూ ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ లేదు. 3 నుంచి 7 లక్షల ఇన్కమ్ మీద 5 శాతం, 7 నుంచి 10 లక్షల రూపాయల మీద 10శాతం, 10 నుంచి 12 లక్షల రూపాల మీద 15శాతం ట్యాక్స్ ఉంటుంది. అలాగే 12 నుంచి 15 లక్షల ఆదాయం మీద 20శాతం, 15 లక్షలకు మించిన ఆదాయం మీద 30శాతం ఐటీ విధిస్తారు. కొత్త విధానంలో ఏడాదికి 17 వేల 500 రూపాయల ట్యాక్స్ ఆదా అవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 5 లక్షల రూపాయల దాకా ట్యాక్స్ లేకుండా రిలీఫ్ ఇవ్వాలన్న డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యోగులు బడ్జెట్ పై నిరాశగా ఉన్నారు.