Mukesh Ambani: ముఖేష్ అంబానీకి బెదిరింపులు.. నిందితుడు తెలంగాణ యువకుడే..!

ముఖేష్ అంబానీని రూ.20 కోట్ల రూపాయలు చెల్లించాలనీ.. లేకపోతే చంపేస్తానని మొదటి మొయిల్‌లో డిమాండ్ చేశాడు గణేష్. దీనిపై ముంబై పోలీసులకు అక్టోబర్ 27న రిలయన్స్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఇంఛార్జ్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రూ.200 కోట్ల రూపాయలు చెల్లించాలని మరో మెయిల్ పంపాడు.

  • Written By:
  • Updated On - November 4, 2023 / 04:13 PM IST

Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ 9Reliance Industries) అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani)ని బెదిరించింది ఎవరో కాదు.. తెలంగాణ (Telangana)కు చెందిన 19యేళ్ళ యువకుడు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ వరుసగా మూడు మెయిల్స్ పంపించాడు రాష్ట్రానికి చెందిన గణేష్ రమేష్ వనపర్తి. అతడిని కనిపెట్టిన ముంబై పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ముఖేష్ అంబానీని రూ.20 కోట్ల రూపాయలు చెల్లించాలనీ.. లేకపోతే చంపేస్తానని మొదటి మొయిల్‌లో డిమాండ్ చేశాడు గణేష్.

దీనిపై ముంబై పోలీసులకు అక్టోబర్ 27న రిలయన్స్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఇంఛార్జ్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రూ.200 కోట్ల రూపాయలు చెల్లించాలని మరో మెయిల్ పంపాడు. ఇక మూడో మెయిల్‌లో రూ.400 కోట్ల రూపాయలు పంపాలంటూ ముఖేష్ అంబానీకి మెయిల్ పెట్టాడు తెలంగాణకు చెందిన గణేష్. దీనిపై ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే బెల్జియంకు చెందిన షాదాబ్ ఖాన్‌కు చెందిన మెయిల్ ఐడీ పేరుతో బెదిరింపు ఈ మెయిల్స్ పంపినట్టు గుర్తించారు. అయితే ఇవి కరెక్ట్ ఐడీనా లేదంటే ఫేక్ ఐడీనా అన్నదానిపై ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు. గతంలో బిహార్ నుంచి కూడా ఇలాంటి బెదిరింపు కాల్సే వచ్చాయి. ముఖేష్ అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను చంపుతామని గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేశారు.

HN రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌తో పాటు అంబానీ నివాసం ఉంటున్న Antilia ఇంటిని కూడా పేల్చేస్తామని అప్పట్లో బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే, అంబానీకి, ఆయన కుటుంబ సభ్యులకు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది.