Gopanpally flyover : నేడు గోపన్‌పల్లి ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం.. బీఆర్ఎస్ నిర్మాణం.. కాంగ్రెస్ ఓపెనింగ్

నగర ప్రజలకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నగర శివారు లోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గోపన్ పల్లితండా పైవంతెన ఎట్టకేలకు వాహనాదారులకు అందుబాటులోకి రానుంది. ఈ ఫ్లైఓవర్ తో గోపలన్ పల్లి, తెల్లాపూర్, నల్లగండ్ల గేటెడ్ కమ్యునిటీల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది. ఐటీ కారిడార్ కు మరింత సులభతరం అవుతుంది.

నగర ప్రజలకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నగర శివారు లోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గోపన్ పల్లితండా పైవంతెన ఎట్టకేలకు వాహనాదారులకు అందుబాటులోకి రానుంది. ఈ ఫ్లైఓవర్ తో గోపలన్ పల్లి, తెల్లాపూర్, నల్లగండ్ల గేటెడ్ కమ్యునిటీల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది. ఐటీ కారిడార్ కు మరింత సులభతరం అవుతుంది. గత ప్రభుత్వంలో మాజీ ఐటీ, పురపాలక శాఖ మంత్ర కేటీఆర్ సుమారుగా రూ.28.5 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేశారు. 2020లో నిర్మాణ పనులు మొదలై కరోనా కారణంగా వంతెన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. అనంతరం యుద్ధప్రాతిపదికన కాగా రోడ్లు భవనాల శాఖ, పీవీరావ్ నిర్మాణ సంస్థ ఈ వంతెన నిర్మాణం చేపట్టింది. నిజానికి ఈ వంతెన పూర్తి అయ్యి దాదాపు 2-3 నెలలు అవుతుంది. ఇలోగా దేశంలో, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో వంతెన ప్రారంభానికి ఆటకం కలిగింది. ఈ ఫ్లైఓవర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుండడంతో స్థానికులు, ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం లభించనుంది.

  • వంతెన నిర్మాణం..

ఈ వంతెన సూమారుగా రూ.28.5 కోట్ల వ్యయంతో నిర్మాంచారు. ఈ వంతెన ఆకారం సైతం “వై” లెటర్ ఆకారంలో ఒక వైపు వెళ్లేందుకు నిర్మించారు. గౌలిదొడ్డి వైపు నుంచి నల్లగండ్ల వైపునకు వెళ్లేందుకు 430 మీటర్లు, తెల్లాపూర్ వైపునకు 550 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో వంతెనను పూర్తి చేశారు. 243 మెట్రిక్ టన్నుల స్టీల్, 806 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించి 84.4 మీటర్ల సింగిల్ స్పాన్‌తో వంతెన నిర్మించారు.

  • కేటీఆర్ ట్వీట్.. వంతెన ఓపెనింగ్ ఎప్పుడు..?

మాజీ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ తోనే ప్రభుత్వంలో చలన వచ్చింది అంటున్న నెటిజన్లు.. గోపన్‌పల్లి ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తి చేసుకున్నా.. ప్రారంభించకపోవడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త చర్చనీయాంశం అయ్యింది.

 

  • బీఆర్ఎస్ హయంలో నిర్మాణం.. కాంగ్రెస్ హయంలో ప్రారంభోత్సవం..

గత సంవత్సంర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవడ్డంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు గోపన్‌పల్లి తండా వద్ద కొత్త ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. నేడు ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి నోజుకోవడంతో ఫ్లైఓవర్ పై రాత్రి సమయంలో అందంగా కనిపించి కనిందు చేసేందుకు విద్యుత్ దీపాలను అమర్చారు. ఇక ఫ్లైఓవర్ ఓపెనింగ్ కు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రావడంతో.. ఫ్లైఓవర్ పైభాగం, కింది భాగాన్ని GHMC అధికారులు పూల మొక్కలతో అందంగా అలంకరించారు.