ఆస్ట్రేలియా గడ్డపై గ్రేట్ విక్టరీ

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది.

  • Written By:
  • Updated On - November 25, 2024 / 02:40 PM IST

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. (150 & 487/6 డిక్లేర్) ఆస్ట్రేలియా (104 & 238)ని 295 పరుగుల తేడాతో ఓడించింది. 534 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో క్రమంగా వికెట్ లు కోల్పోయింది. ట్రావిస్ హెడ్, మార్ష్, స్మిత్, కేరి పోరాడే ప్రయత్నం చేసినా భారత బౌలర్లు అవకాశం ఇవ్వలేదు.

భారత్ తరఫున మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా చెరో మూడు వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా రెండు వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా తరఫున ట్రావిస్ హెడ్ 89 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిచెల్ మార్ష్ 47 పరుగులు చేయగా, అలెక్స్ కారీ 36 పరుగులు చేశాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.