India vs England: తొలి టెస్టులో భారత్ ఓటమి.. లక్ష్య చేధనలో వెనుకబడ్డ టీమిండియా

మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 190 పరుగుల భారీ ఆధిక్యం సాధించినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా, ఆలౌటై మ్యాచ్ కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకే ఆలౌటైంది.

  • Written By:
  • Publish Date - January 28, 2024 / 06:27 PM IST

India vs England: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య, హైదరాబాద్, ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి పాలైంది. తొలి టెస్టు, నాలుగో రోజు ఆటలో భారత్.. 28 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో నాలుగు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 190 పరుగుల భారీ ఆధిక్యం సాధించినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా, ఆలౌటై మ్యాచ్ కోల్పోయింది.

Bodhan ex-MLA Shakeel: దొంగ పోలీస్‌.. షకీల్‌ కొడుకు హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సీఐ అరెస్ట్‌..

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకే ఆలౌటైంది. 231 పరుగుల లక్ష్యానికి 18 పరుగుల దూరంలో ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ వైఫల్యం కాగా.. ఇంగ్లండ్‌కు సంబంధించి అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న స్పిన్నర్ టామ్ హార్ట్లీ ఏడు వికెట్లతో (7/62) సత్తాచాటాడు. భారత రెండో ఇన్నింగ్స్‌కు సంబంధించి 231 పరుగుల లక్ష్యానికిగాను.. కెప్టెన్ రోహిత్ శర్మ (39), కేఎస్ భరత్ (28), రవిచంద్రన్ అశ్విన్ (28)తో రాణించగా.. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. శుభ్‍మన్ గిల్ (0) డకౌట్ అయి మరోసారి నిరాశపరిచాడు. అక్షర్ పటేల్ (17), కేఎల్ రాహుల్ (22), రవీంద్ర జడేజా (2), శ్రేయస్ అయ్యర్ (13) పరుగులు మాత్రమే చేశారు. అశ్విన్ చివర్లో రాణించినట్లు కనిపించినా మ్యాచ్ గెలవలేకపోయింది. తొలి మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లండ్ 24 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లను పడగొట్టాడు. ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్, జో రూట్ చెరో వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు సంబంధించి ఓలీ పోప్ 196 పరుగులతో అదరగొట్టాడు. అయితే, డబుల్ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో ఔటయ్యాడు. భారత బౌలర్లలో జస్‍ప్రీత్ బుమ్రా నాలుగు, రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు, రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీసుకోగా, అక్షర్ ఒక వికెట్ తీసుకున్నాడు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‍లో భారత్ 0-1తో వెనుకబడింది.