Republic Day Army Alert : AIతో ఇండియన్ ఆర్మీ నిఘా… రిపబ్లిక్ డే వేడుకలకు భద్రత !

భారత రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా జనవరి 26 నాడు ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశముంది. వాటిని తిప్పికొట్టేందుకు ఇండియన్ ఆర్మీ అలెర్ట్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే పరికరాలతో సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఉగ్రవాదులు దేశంలోకి రాకుండా నిరంతరం కాపాలా కాస్తున్నారు భారత జవాన్లు.

భారత రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా జనవరి 26 నాడు ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశముంది. వాటిని తిప్పికొట్టేందుకు ఇండియన్ ఆర్మీ అలెర్ట్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే పరికరాలతో సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఉగ్రవాదులు దేశంలోకి రాకుండా నిరంతరం కాపాలా కాస్తున్నారు భారత జవాన్లు.

రిపబ్లిక్ డే (India Republic Day) సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడకుండా భారత సైన్యం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ (Pakistan) వైపు నుంచి సరిహద్దుల గుండా దేశంలోకి టెర్రరిస్టులు చొరబడకుండా గత కొన్ని రోజులుగా గట్టి పహారా కాస్తోంది. AI టెక్నాలజీతో (Artificial Intelligence) ఉన్న ఆయుధాలతో షిఫ్టుల వారీగా జవాన్లు సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇందులో నైట్‌ విజన్‌ ఆయుధాలే కీలకంగా ఉన్నాయి.

జమ్ముకశ్మీర్‌లోని గురేజ్, బందిపొరాలో ట్రైనింగ్ తీసుకున్న స్నైపర్‌లను మోహరించారు. నైట్ విజన్‌ (Night Vision) పరికరాలతో నైట్ పెట్రోలింగ్‌ నడుస్తోంది. హై ఎండ్ టెక్నాలజీ కలిగిన వీటితో చీకట్లోనే శత్రువుల కదలికలపై నిఘా పెట్టే అవకాశముంది. సరిహద్దులు దాటి ఎవరూ రాకుండా గట్టి చర్యలు తీసుకున్నట్టు సైనికాధికారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల అయితే… రాత్రి వేళల్లో ముఖానికి రంగులు పూసుకుని సైనికులు డ్యూటీ చేస్తున్నారు.

రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఢిల్లీలోనూ భద్రతను పెంచారు. పెరేడ్ జరిగే కర్తవ్యపథ్‌ (Karthavya Path) చుట్టూ 14 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈ ఏడాది వేడుకలకు 77 వేల మంది ఆహ్వానితులు వస్తారని అంచనా. కమాండోలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ , PCR వ్యాన్లు, స్వాట్‌ టీమ్స్ ని మొహరించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా తిప్పికొట్టేలా ఢిల్లీ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. సీసీ కెమెరాలతో పోలీసుల గట్టి నిఘా పెట్టారు. అటు ఆకాశం మీద కూడా నిఘా పెట్టారు. రిపబ్లిక్ వేడుకల కోసం ఢిల్లీలో 25 రాత్రి 10 గంటల నుంచి జనవరి 26 ఉదయం వరకూ వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. వేడుకలను చూడటానికి వచ్చేవారు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లోనే ప్రయాణించాలనీ… ప్రైవేట్ వెహికిల్స్ లో రావొద్దని పోలీసులు కోరుతున్నారు.